పోలింగ్‌కు సర్వం సిద్ధం

May 12,2024 21:23

గుమ్మలక్ష్మీపురం/కురుపాం: ఓటింగ్‌ కు వేళయింది. ఐదేళ్లకొకసారి వచ్చే అతి పవిత్రమైన, ముఖ్యమైన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సోమవారం జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియమ్మ వలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లో 137 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 268 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గం పరిధిలో 1,94114 మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 94,336, మహిళా ఓటర్లు 9,9736, థర్డ్‌ జెండర్‌ 42 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో 268 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఒక్కొక్క కేంద్రానికి ఆరుగురు సిబ్బందిని ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నియమించారు. నియోజకవర్గం మొత్తం 1608 మంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. మరో 300 మందిని రిజర్వులో ఉంచారు. 39 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ పోలింగ్‌ పటిష్టంగా నిర్వహించేందుకు పోలీస్‌ బందోబస్తుతో 144 సెక్షన్‌ అమల్లోకి తీసుకువచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని ఆర్టీసీ బస్సుల్లో శనివారం మధ్యాహ్నం పంపించి ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.కురుపాం జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో డిస్ట్రిబ్యూషన్‌ కౌంటర్లను రిటర్నింగ్‌ అధికారి వి.వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 44మంది సెక్టోరియల్‌ అధికారులు ఆదివారం నుంచి 268పోలింగ్‌ కేంద్రాలుకు ఇవిఎంలను, ఇతర సామాగ్రి కౌంటర్ల వారీగా సిబ్బందికి అందజేశారు. అనంతరం రవాణా కోసం ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఎన్నికలు సామగ్రి పంపిణీ ,భోజన సౌకర్యాలు, త్రాగు నీరు, మెడికల్‌ , రవాణా సౌకర్యాలు ను రిటర్నింగ్‌ అధికారి వివి రమణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలు కమీషన్‌ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.పార్వతీపురంరూరల్‌ : స్థానిక ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం నుండి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తరలి వెళ్లాయి. నియోజకవర్గంలో 233 పోలింగ్‌ కేంద్రాల్లో జరగబోయే ఈ ఎన్నికల్లో దాదాపు 1600మందికి పైగా సిబ్బంది పాల్గొననున్నారు. దీనికితోడు 350 మంది పోలీసు సిబ్బంది, ఒక కంపెనీ సిఆర్‌పిఎఫ్‌ దళాలు శాంత్రిభద్రతల పర్యవేక్షణ చేయనున్నారు. సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజన వసతులు ఏర్పాటు చేసామని ఆర్‌ఒ కె.హేమలత తెలిపారు. 1,89,817 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 37 రూట్‌లు, 33 సెక్టార్లలో జరుగుతుందని, ఎన్నికల సామాగ్రి రవాణా నిమిత్తం 65 బస్సులు వినియోగిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 103 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి అక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసుల సహకారంతో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఓటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, అలాగే వికలాంగులు, గర్భిణులకు సౌకర్యవంతంగా ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఎన్నికలకు సర్వం సిద్ధం పాలకొండ : నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ప్రభుత్వ బాలురు జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి ఎన్నికల సామాన్లు అధికారులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 287 పోలింగ్‌ కేంద్రాల్లో 1,95,020 మంది ఓటర్లు ఉన్నారు. అందుకు గాను 287మంది పిఒలు, 287మంది ఎపిఒలు, 287మంది ఒపిఒలు ఉన్నారు. 35మంది సెక్టర్‌ అధికారులను నియమించి 35సెక్టర్లుగా విభజించారు. 142కేంద్రాల్లో వెబ్‌ కాస్ట్‌ తో ఏర్పాటు చేశారు. అలాగే పాలకొండ మండలంలో టిడిపారాపురం, అంపిలి, అవళింగి, వీరఘట్టం మండలంలో గంగంపేట, తూడి, భామిని మండలంలో మనిగ, బత్తిలి గ్రామాలను అతిసమ సాత్విక గ్రామాలుగా గుర్తించారు. ఇక్కడ కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు. పార్వతీపురం దిశా డీఎస్పీ హర్షితచందన ఎన్నికల నిర్వహణ పర్యవేక్షిస్తున్నారు. ఆరుగురు సిఐలు, 20 మంది ఎస్సైలు, 400 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. కేంద్ర బలగాలు 100 మంది, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ 16 మంది, ఆక్టోపస్‌ 50 మంది, విశ్రాంతి ఆర్మీ 16 మంది, విశ్రాంతి పోలీసులు 15 మంది, ఎన్‌.ఎస్‌.ఎస్‌, ఎన్‌.సి.సి 108 మంది గట్టి బందోబస్తు చేపట్టనున్నారు. అరకొర ఏర్పాట్లుఎన్నికల సామాగ్రి తీసుకొచ్చే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఎండ తీవ్రంగా ఉండడంతో నీటికి కటకటలాడారు. పూర్తి స్థాయిలో నీటి సదుపాయం కనిపించకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. అదేలా మధ్యాహ్నం భోజనం కూడా పార్సిల్‌ చేసి ఇచ్చినప్పటికీ సరైన మోతాదులో ఇవ్వలేదని ఉద్యోగులు ఆరోపించారు.ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు : ఆర్‌ఒఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని రిటర్నింగ్‌ అధికారి శుభం బన్సల్‌ తెలిపారు. ఆదివారం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం దగ్గర విలేకరులతో మాట్లాడుతూ 287పోలింగ్‌ కేంద్రాల్లో కూడా ఎన్నికలు సజావుగా జరిగేలా దృష్టి పెట్టామన్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, పోలింగ్‌ కేంద్రాల దగ్గర బిఎల్‌ఒలను నియమించి, అక్కడ టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేసి, తాగునీటి సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. 142 కేంద్రాలను గుర్తించి నిఘా కెమెరాల ద్వారా పోలింగ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. సోమవారం ఉదయం 5:30గంటలకు పోలింగ్‌ కేంద్రాల దగ్గర మాక్‌ పోలింగ్‌ చేపడతామని, పోలింగ్‌ ఏజెంట్లు అందరు హాజరు కావాలని కోరారు. పోలీసు బందోబస్తు సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలింగ్‌ తక్కువ జరిగిన కేంద్రాల దగ్గర దృష్ట్టి పెట్టి బిఎల్‌ఒలు, ఇతర తమ సిబ్బంది ఓటర్లను తీసుకొచ్చేలా చూస్తామన్నారు. అలాగే ప్రజలకు ఇప్పటికే ఓటింగ్‌పై అవగాహన కల్పించినట్టు తెలిపారు.

➡️