డాక్టర్‌ కోడూరుకు అన్నమయ్య పురస్కారం

May 20,2024 21:14

సాలూరు : పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ కోడూరు సాయి శ్రీనివాసరావు అన్నమయ్య పురస్కారాలు -2024కు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనకు చిత్తూరు జిల్లాకు సంప్రదాయ కళల పరిరక్షణ సంస్థ, ఎఎస్‌ ఫౌండేషన్‌ నుంచి ఆహ్వానం అందింది. ఈనెల 26న చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం గొల్ల చీమనపల్లిలో నిర్వహించనున్న అన్నమయ్య పురస్కారాల ప్రదానోత్సవానికి హాజరు కావాలని కోరారు. కోడూరు సాయి శ్రీనివాసరావు సాంప్రదాయ కళల పరిరక్షణ లో, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణతో పాటు సొంతంగా పాఠశాల నిర్వహిస్తున్నారు.

➡️