ఎన్నికల ఉద్యోగుల అగచా(పా)ట్లు

May 12,2024 21:26

గుమ్మలక్ష్మీపురం : ఎన్నికల విధుల్లో పోలింగ్‌ నిర్వహణ సామాగ్రి కోసం ఆదివారం కురుపాం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌కు వచ్చిన ఉద్యోగులకు పాట్లు తప్పలేదు. ఉద్యోగులు చంటి బిడ్డలతో ఎన్నికల విధులకు హాజరయ్యారు. కౌంటర్ల వద్ద తగినన్ని ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఉక్క పోతతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరోవైపు తాగునీరు చాలక దాహార్తితో ఇబ్బందులు పడ్డారు. తప్పని పరిస్థితిలో బయటికు వెళ్లి కొనుక్కోవాల్సి వచ్చింది. పోలింగ్‌ ప్రశాంత నిర్వహణకు పెద్ద సంఖ్యలో కేంద్ర పోలీసు బలగాలను ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నట్లు పాలకొండ డిఎస్‌పి కృష్ణారావు, సిఐ సత్యనారాయణ తెలిపారు.

➡️