స్ట్రాంగ్‌రూం పరిశీలన

Apr 21,2024 22:12

సాలూరు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్‌ రూంలను నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి సి.విష్ణు చరణ్‌ ఆదివారం పరిశీలించారు. ఇవిఎంల భద్రతకు సంబంధించి తహశీల్దార్‌ ఎ.సింహాచలంకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్వో కార్యాలయాన్ని సందర్శించారు.పార్వతీపురంరూరల్‌ : మేలో జరగబోయే శాసనసభ ఎన్నికలకు ఉపయోగించాల్సిన ఇవిఎంలను భద్రపర్చిన రూములను ఆదివారం పార్వతీపురం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కె.హేమలత పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఇవిఎం స్ట్రాంగ్‌ రూములను సిబ్బందితో కలిసి ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీతానగరం తహశీల్దార్‌ ఎ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️