ఆయన ఆకస్మిక బదిలీ వెనుక మర్మమేమిటో..?

Mar 13,2024 10:27 #Manyam District

ప్రజాశక్తి-మక్కువ : ఇటీవలే ఎన్నికల ప్రక్రియ లో భాగంగా బదిలీపై వచ్చిన మక్కవ తాసిల్దార్ సింహాచలం ఆకస్మిక బదిలీ వెనుక మర్మమేమి దాగి ఉందని పలువురు చర్చించుకుంటున్నారు స్థానికంగా మంగళవారం వరకు విధులు నిర్వహించిన ఆయన బుధవారం సాలూరు మండలానికి బదిలీ అయినట్లు వార్తలు సోషల్ మీడియాలో కూడా నిలబడ్డాయి మరో ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఆకస్మిక బదిలీకి ప్రాధాన్యత సంతరించుకుంది తాసిల్దార్ బదిలీపై వచ్చి కనీసం నెలరోజులు కూడా గడవకముందే బదిలీ కావడం సర్వత్రా చర్చకు దారి తీసింది ఇలా ఉండగా ఇటీవల కాలంలో తాసిల్దార్ కార్యాలయం వెళ్లే ప్రజాప్రతినిధులకు సమస్యలపై వెళ్లే ప్రజలకు రెవెన్యూ కార్యాలయంలో ఒకరిద్దరు అధికారుల మినహా చాలావరకు గౌరవప్రదముగా భాష వినియోగించడం లేదని ఆరోపణలు ఉన్నాయి ఏకవాక్యంతో వచ్చిన వారిని సంబోధిస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా సర్వే డిపార్ట్మెంట్లో ఓయ్.. నువ్వు.. అటువంటి పదాలను ఉపయోగిస్తూ ఉండడంతో కొంతమందికి ఇబ్బందికరంగా ఉందన్న అసహనం ప్రజల్లో వ్యక్తం అవుతుంది ఇప్పటికైనా కార్యాలయాలకు వచ్చే ప్రజల పట్ల ప్రజాప్రతినిధుల పట్ల అధికారులు ఒకంత గౌరవంతో వ్యవహరించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

➡️