సామర్లకోటలో మున్సిపల్ కార్మికులు భారీ ప్రదర్శన

Jan 7,2024 15:01 #Dharna, #Kakinada, #muncipal workers

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్(కాకినాడ) : మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా ఐదవ రోజు ఆదివారం సామర్లకోటలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని, జీతం పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి స్టేషన్ సెంటర్ వరకు పట్టణ ప్రజల మద్దతు కోరుతూ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో అగ్రభాగాన ప్రజానాట్యమండలి కళాకారులు మడగల రమణ, పెదిరెడ్ల అర్జున్ రావు, సప్త సూరిబాబు తదితరులు విప్లవ గేయాలతో పట్టణ ప్రజలను కార్మికులను ఆకర్షించారు. స్టేషన్ సెంటర్ వద్ద ఏఐటీయూసీ నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దిరెడ్డి సత్యనారాయణ, సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎలిసెట్టి రామదాసు తదితరులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ నాయకులు బోచ్చా శీను కసింకోట ఆనందరావు, కసింకోట కిషోర్ ,ఎస్ శ్రీనివాస్ చింతల రమణ ,బంగారు రత్నం, బంగారు తులసి, పెనుబాక సారమ్మ ,బంగారు కొండమ్మ, వేల్పుల సింహాచలం, గూడుపు దాలమ్మ, చిన్న దుర్గ భవాని , కౌలు వరమ్మ, సింగంపల్లి పద్మ, బంగారు కొండమ్మ, చెన్నా నాగ మనీ ,బంగారు లావణ్య, సత్తిబాబు, ఆజారి లావరాజు, వెంకటేశు, ఎన్వి నాగేంద్ర, మిర్యాల రాజు తదితరులు పాల్గొని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

➡️