సిఐటియు అడుగుజాడల్లో నడుస్తాం : ఎంఆర్పిఎస్‌ కార్మికులు

May 7,2024 13:17 #CITU, #MRPS workers

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో కార్మిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు అడుగుజాడల్లో నడుస్తామని ఎమ్మార్పీఎస్‌ కు చెందిన 120 మంది కార్మికులు వెల్లడించారు. మంగళవారం వారు సిఐటియు కార్మిక సంఘం అనుబంధంగా చేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు ,ఎమ్మార్పీఎస్‌ నగర అధ్యక్ష కార్యదర్శులు , వెంకటేశు, ఎల్‌ దేవరాజు,ట్రెజరర్‌ ఎం ముత్తురాజ్‌, సహాయ కార్యదర్శి సర్దార్‌ అమ్మ,పెద్దన్నూరు, సలహా కార్యదర్శి మంజునాథ,రాజేష్‌, కమిటీ సభ్యులు నారాయణ, కార్తీక్‌, శేఖర్‌, ఓబులమ్మ, రత్నమ్మ, వారు మాట్లాడుతూ …. ఎమ్మార్పీఎస్‌ అంటే ఎం.నల్లప్ప అంటూ వారు అడుగుజాడల్లో ఇన్ని సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం.. కానీ ఇప్పుడు ఎమ్మార్పీఎస్‌ ఎస్సి కార్మిక సంఘం అంటూ కార్మికులను చదువు సంధ్య లేదు… కాబట్టి ఎస్సీ కార్మిక వర్గ సంఘం అంటూ పేరుతో కొత్త సంఘాలు పుట్టుకొచ్చి కార్మికుల దగ్గర దళారీ వ్యవస్థ మొదలుపెడుతూ కార్మికులను రక్తం మాంసం పీక్కుతింటున్నాయన్నారు. ఇప్పటికే ఈపీఎఫ్‌ ఈఎస్‌ఐ అంటూ డెత్‌ క్లెయిమ్‌ అంటూ లక్షలు రూపాయలను కుంభకోణాలు చేస్తున్నారు అయినా సహించి వదిలేశామన్నారు. కానీ ఇప్పుడు మున్సిపల్‌ కార్మికులను మరింత దోపిడీకి గురి చేస్తుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. అందుకే అనంతపురం జిల్లా మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు అనుబంధం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏటీఎం నాగరాజు కే నాగభూషణం చేస్తున్న పోరాటం మున్సిపల్‌ కార్మికుల కోసం తమ ప్రాణాల సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న సిఐటియు ఎర్ర జెండా తోనే కలిసి నడుస్తామని తెలియజేస్తున్నామని అన్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏటీఎం నాగరాజు కే నాగభూషణం ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్‌ రెగ్యులర్‌ కార్మికులు అవుట్సోర్సింగ్‌ కార్మికులు మొత్తం 128 మంది సిఐటియు అనుబంధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడవ సర్కిల్‌ మున్సిపల్‌ కార్మికులు అందరూ పాల్గొనడం జరిగినది.

➡️