వంట-వార్పుతో మున్సిపల్ కార్మికుల నిరసన

Jan 9,2024 16:20 #Kakinada, #muncipal workers

ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ) : తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 15 వ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా మున్సిపల్ సెంటర్ లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద మున్సిపల్ కార్మికులు వంట – వార్పుతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించినట్లు చర్చల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.జీతాలు పెంచాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మె చేస్తున్న కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిరపరపు శ్రీనివాస్,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వర్రె గిరిబాబు,శివకోటి అప్పారావు,సింగంపల్లి సింహాచలం,ద్రౌపతి శ్రీను,వేలాపు శివ, భవాని,ముత్యాల సత్యనారాయణ,వర్రె కుమారి,నాగ దుర్గ,మడికి కృష్ణ,బంగారు సూరిబాబు,తడారి భవాని,సేలం శ్రీను,గంటా రమణ,ఇసరపు దుర్గాప్రసాద్,శ్రీకాంత్,మోహన్ రావు,వర్రె నాగ దుర్గారావు,రాజేష్,సింగంపల్లి శివ,వెంకటలక్ష్మి,నీలాపు నూకరత్నం,వర్రె కుమారి,ముత్యాల దుర్గ,సింగంపల్లి మరిడమ్మ,దేవి,పెడారి భవాని,పెద్ద వెంకటలక్ష్మి,పలివల సత్యవతి,భవాని,నారాయణమూర్తి, శేషారావు తదితరులు పాల్గొన్నారు.

➡️