సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి

Dec 31,2023 21:31

నంద్యాలలో మున్సిపల్‌ కార్మికుల సమ్మెనుద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం

సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి
– సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.యేసురత్నం
– 6వ రోజు కొనసాగిన మున్సిపల్‌ కార్మికుల సమ్మె
– ఆత్మకూరులో భిక్షాటన, నందికొట్కూరులో అర్ధనగ ప్రదర్శన
– ఆళ్లగడ్డలో కమిషనర్‌ చీపురు పట్టి చెత్త ఊడ్చేందుకు యత్నం – అడ్డుకున్న కార్మికులు
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌
మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.ఏసురత్నం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా చేపట్టిన సమ్మె ఆదివారం 6వ రోజుకు చేరకుంది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.ఏసురత్నం మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు, సమాన పనికి సమాన వేతనం, జీవో నెంబర్‌ 7 ప్రకారం స్కిల్డ్‌, సెమి స్కిల్డ్‌ వేతనాలు అర్హులైన కార్మికులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను, అసెంబ్లీలో చెప్పిన మాటలను నెరవేర్చాలన్నారు. జనవరి ఒకటో తేదీ మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేసి తీపి కబురు అందించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్‌, కే మహమ్మద్‌ గౌస్‌, యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణయ్య, భాస్కరాచారి, నాయకులు రామకృష్ణ, ఆదాము, రామాంజనేయులు, నాగేశ్వరరావు, రమణ, సిద్దయ్య, కార్మికులు పాల్గొన్నారు. ఆత్మకూర్‌ : పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం దగ్గర మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెలో భాగంగా భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. సిఐటియు పట్టణ అధ్యక్షులు రజాక్‌, కార్యదర్శి రామ్‌ నాయక్‌, ఉపాధ్యక్షులు రణధీర్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు నాగన్న, గొడుగురాజు, జోసెఫ్‌, పెద్ద నాగరాజు, కార్మికులు తిమయ్య, నాగన్న, మోహన్‌, సురేష్‌, దానమయ్య, రవి, రూతమ్మ, జీవరత్నమ్మ, మణెమ్మ, సుగుణమ్మ, కుమారి, సుశీలమ్మ, తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు టౌన్‌ : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి పటేల్‌ సెంటర్‌ చేరుకొని రాస్తారోకో నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్‌ రెడ్డి, నాయకులు పరమేష్‌, భాస్కర్‌, నాగేశ్వరరావు, బాసిక్‌ అబ్రహం, నాగన్న, ప్రభుదాసు, ఏసన్న పాల్గొన్నారు. డోన్‌ : డోన్‌ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం 6వ రోజు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో దీక్షా శిబిరంలో మున్సిపల్‌ కార్మికులు అర్ధనగ ప్రదర్శన చేశారు.సిఐటియు జిల్లా కార్యదర్శి టి.శివరాం, మండల,పట్టణ అధ్యక్షులు పి.రామాంజనేయులు, నక్కి శ్రీకాంత్‌,ఆవాజ్‌ నాయకులు అక్బర్‌ బాషా,మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కుళ్లాయప్ప,అధ్యక్ష, ఉపాధ్యక్షులు గోవిందు,పెద్ద ఎల్లయ్య మాట్లాడారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు దేవదానం, యేసు, హైమారావు, ఆవులయ్య, రామాంజి, చంద్ర, సురేష్‌ వెంకట లక్ష్మమ్మ, అంజనమ్మ, రంగనాయకులమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఆళ్లగడ్డలో కమిషనర్‌ చీపురు పట్టి చెత్త వూడ్చేందుకు ప్రయత్నం – అడ్డుకున్న కార్మికులు, వాగ్వివాదం ఆళ్లగడ్డ : మున్సిపల్‌ వర్కర్స్‌ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మెలో ఆదివారం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పారిశుధ్య కార్మికుల సమ్మె కారణంగా పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే నిల్వ ఉండడంతో వాటిని తొలగించేందుకు చెత్త వాహనాలను బయటకు తీసుకెళ్ళేందుకు కమిషనర్‌ కార్యాలయ సిబ్బంది ప్రయత్నించారు. ఈ దశలో సిఐ రమేష్‌ బాబు, పట్టణ ఎస్సై వెంకట్‌ రెడ్డి సిబ్బందితో మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నారు. సమ్మెను ఆటంకపరచమని, వాహనాలను తీసుకెళ్ళేందుకు అంగీకరించాలని సిఐ కార్మికులను కోరారు. అందుకు కార్మికులు ససేమీరా అంటూ మున్సిపాలిటీ కార్యాలయ గేటు వద్ద అడ్డంగా కూర్చున్నారు. బిజెపి తాలూకా బాధ్యులు భూమా కిషోర్‌ రెడ్డి కూడా కార్మికులకు మద్దతుగా పురపాలక కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సీఐ రమేష్‌ బాబు, కమిషనర్‌ రమేష్‌ బాబులు కార్మికులకు ఎంత నచ్చజెప్పినా అంగీకరించలేదు. చివరకు చేసేదేమీ లేక పురపాలక సిబ్బంది, పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కమిషనర్‌ ఏవి రమేష్‌ బాబు చీపురు పట్టి వీధులను శుభ్రం చేసేందుకు ప్రయత్నించారు. వీధులను ఉడ్చేందుకు ప్రయత్నిస్తున్న కమిషనర్‌ను సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకున్నారు. కమిషనర్‌ చేతిలో నుంచి చీపురు లాక్కున్నారు. తాము చేస్తున్న సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించడం సబబు కాదని కమిషనర్‌తో కార్మికులు వాదనకు దిగారు. దీంతో కమిషనర్‌ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని మున్సిపాలిటీ కార్మిక సంఘం నాయకులు వెంకటయ్య తెలిపారు.

➡️