రాహుల్‌ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి

Apr 28,2024 21:28
  • కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి భార్గవ్‌, సిపిఐ పశ్చిమ అభ్యర్థి కోటేశ్వరరావు

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : విభజిత ఆంధ్రప్రదేశ్‌ అభివద్ధి చెందటం కేంద్రంలో రాహూల్‌ గాంధీ నాయకత్వం వస్తేనే సాధ్యమ వుతుందని విజయవాడ పార్ల మెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్‌ అన్నారు. ఇండియా వేదిక తరుపున విజయవాడ పశ్చిమ శాసన సభ స్థానానికి పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావుతో కలిసి ఆదివారం వన్‌టౌన్‌ ప్రాంతంలో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భార్గవ్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఇండియ వేదిక అభ్యర్థులు విజయం సాధించి కేంద్రంలో రాహూల్‌ గాంధీ నాయత్వంలో ప్రభుత్వం ఏర్పడితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజస్థాన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హాోం మంత్రి అమిత్‌ షా తాము అధికారంలోకి వస్తే మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని వాగ్ధానం చేశారని పేర్కొన్నారు. మైనార్టీల రిజర్వేషన్‌లు అమలుపై పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ తరుపున పోటీ చేస్తున్న సుజనా చౌదరి మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దుచేస్తారా? కొనసాగిస్తారా అనేది స్పష్టం చేయాలన్నారు. సీపీఎం నగర నాయకులు గాదె బాలిరెడ్డి మాట్లాడుతూ ఇండియా వేదిక బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పీసీపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌. అన్సారీ, సీపీఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు తాడి పైడియ్య పాల్గొన్నారు.

➡️