టిల్‌ బ్రైన్స్‌ పాఠశాలకు స్కూల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

May 10,2024 22:02

ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : నగరంలోని లిటిల్‌ బ్రెయిన్స్‌ పాఠశాలకు ‘ స్కూల్‌ ఎక్స్‌ లెన్స్‌ – 2024’ అవార్డు లభించిందని పాఠశాల డైరెక్టర్‌, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఫణి కుమార్‌ ముక్తేవీ తెలిపారు. నగరంలోని స్కూల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూ ఢిల్లీలో జరిగినగ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్కిల్‌ కాంక్లేవ్‌ -2024లో ఎఐసిటిఇ న్యూఢిల్లీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ టి.జి.సీతారాం చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో గుజరాత్‌, మహారాష్ట్ర, చండీఘర్‌, పంజాబ్‌, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్‌ ఇంకా మరెన్నో రాష్ట్రాల నుండి వచ్చిన సీనియర్‌ ఐఎఎస్‌ ఆఫీసర్లు, యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌, ప్రముఖ విద్యా వేత్తలు, పాల్గొని నూతన విద్యా విధానంపై చర్చించినట్లు తెలిపారు. తమ పాఠశాలలో ఉపయోగించే ఉత్తమమైన సూక్ష్మ బోధనా పద్ధతులు, ఆధునిక బోధనా పద్ధతుల ద్వారా పిల్లలలో సృజనాత్మకత వెలికితీస్తున్నామని తెలిపారు. అందుకే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు తమ పాఠశాలకు లభించిందని తెలిపారు. అవార్డు ప్రదానోత్సవం లో ఎ పి స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ సి ఇ ఓ పి. రాజ బాబు, లిటిల్‌ బ్రైన్స్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ప్రవీనా పాల్గొన్నారు.

➡️