ఆర్‌కె కళాశాలలో సైనోరా టుకే-24

Apr 28,2024 21:29

 ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : ఆర్‌కె కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో నాలుగో సంవత్సరం బిటెక్‌ కంప్లీట్‌ చేసుకున్న విద్యార్థులకు ఫేర్వెల్‌ ఫంక్షన్‌ను సైనోరా టూకే 24 పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ సైనోరా టుకే 24లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాలలో క్రీడా మహోత్సవంలో పాల్గొని విన్నర్స్‌, రన్నర్స్‌కి బహుమతులు అందజేశారు. కళాశాలలో విద్యార్థులు ఎవరైతే వారి వారి ఎకడమిక్‌ సంబంధించిన సర్టిఫికెట్స్‌లో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.రామకృష్ణయ్య చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఉద్దేశించి వివిధ విభాగ అధిపతులు వారి అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. భవిష్యత్తులో వారు ఏ విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, భవిష్యత్తులో జాబ్‌ ఆఫర్స్‌ ఎలా ఉన్నాయో వారికి వివరించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.రామకృష్ణయ్య మాట్లాడుతూ కళాశాలలో ఇప్పటి ఫైనల్‌ ఇయర్‌ ఎవరైతే బయటకు వెళ్తున్నారో వారు 2020 కరోనా టైంలో ఆన్లైన్‌ క్లాసెస్‌ నిర్వహించడం కానీ, ఆన్‌లైన్‌లో సిలబస్‌ని కంప్లీట్‌ చేశారన్నారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఐ సాయిరాం మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఆఖరి ఘట్టం ఈ రోజుతో పూర్తవుతుందన్నారు. తర్వాత జీవితం అంతా బాధ్యతతో కూడి ఉంటుందని తెలుసుకొని తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. కాలేజీని వదిలి వెళ్లే విద్యార్థులందరూ వారి యొక్క కళాశాలతో ఉన్న అనుబంధాన్ని పంచుకొని కళాశాల మేనేజ్మెంట్‌ చైర్మన్‌ ఎం.ఎం.కొండయ్యకు, సెక్రటరీ డాక్టర్‌ మహేంద్ర నాథ్‌కి, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే రామకష్ణయ్యకి వారి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి దశలో ముఖ్యమైన ఘట్టాలను అధిగమిస్తూ ఆఖరి ఘట్టానికి వచ్చామని ఈరోజు కాలేజీని వదిలేయడం చాలా బాధగా ఉందని అయినా విద్యార్థి జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులకు తోటి విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. మూడో సంవత్సరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు.

➡️