‘అనిల్’ రాకకు భారీ ఏర్పాట్లు

Feb 10,2024 14:19 #palnadu district
ready to invite anil kumar yadav

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ నెల 14 న నరసరావుపేట రానున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని పెట్లూరివారిపాలెం గ్రామం నుండి భారీ ర్యాలీగా వెళ్లి అనీల్ కుమార్ కు స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. ర్యాలీ అనంతరం పల్నాడు బస్టాండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి అనేక మంది ప్రముఖులు పోటీ చేసి ఉన్నత పదవులు అధిరోహించారని కాసు బ్రహ్మానంద రెడ్డి, నెదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కొణిజేటి రోశయ్య లాంటి ప్రముఖులు రాష్ట్ర దేశ స్థాయి రాజకీయాలలో గుర్తింపు పొందారన్నారు. చరిత్ర కలిగిన నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి మొట్టమొదటిసారి బిసి అభ్యర్థికి కేటాయించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిసిలపై తమకున్న చిత్తశుద్ధి చాటారన్నారు. రానున్న ఎన్నికల్లో బిసి అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్ ను గెలిపించి పార్లమెంట్ కు పంపాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం శిరోధార్యమన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

➡️