సిపిఎం ఇంటింట ప్రచారం

Apr 1,2024 12:43 #Nellore District

ప్రజాశక్తి-నెల్లూరు : స్థానిక 54 డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం ప్రాంతంలోని లక్ష్మీ స్ట్రీట్,చిన్న మసీదు ప్రాంతం, లంగర తోట తదితర ప్రాంతాల్లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం.రమేష్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. రానున్న ఎన్నికల్లో నగర నియోజకవర్గానికి పోటీ చేయనున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించాలంటూ సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్నా నది ఒడ్డునే ఉన్నప్పటికీ నగరంలో మంచినీటి కొరత తీవ్రంగా ఉండడం విచారకరమన్నారు. జిల్లా అధికార యంత్రాంగం తాగునీటి సమస్య మైన స్పందించి యుద్ధ ప్రాతిపదికన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా పేదలు నివసించే ప్రాంతాల పట్ల వివక్ష తగదని, ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం అన్ని ప్రాంతాలకు కల్పించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టి తిరిగి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. అటువంటి పార్టీకి మద్దతు ఇస్తున్న టిడిపి వైసిపి జనసేన పార్టీలకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, జి నాగేశ్వరరావు,ఆ డివిజన్ శాఖ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, సిపిఎం సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు

➡️