పతుల కోసం సతులు

Feb 14,2024 12:38 #Prakasam District
election campaign in

ప్రజాశక్తి-ఒంగోలు : మహిళలతో మమేకం.. స్త్రీ శక్తితో శశిదేవి… అనే నినాదంతో స్థానిక 28వ డివిజన్లో మహిళలతో కలిసి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి సతీమణి శశిదేవి మాట్లాడారు. ఈపాటికి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గ నాయకులు, దామచర్ల జనార్ధన్ సతీమణి నాగ సత్యలత #నారీతో.. నాగ సత్యలత# అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శశిదేవి ఆయనకు మద్దతుగా వార్డుల్లో పర్యటిస్తున్నారు. పతుల కోసం సతులు ఇప్పటి నుంచే వార్డుల్లో తిరుగుతూ మహిళలను కలవడం ఒంగోలు నగరంలో ఆసక్తిగా మారింది. అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

➡️