పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేత

Feb 8,2024 15:23 #ntr district, #utf

ప్రజాశక్తి-రెడ్డిగూడెం(ఎన్‌టిఆర్‌) : రెడ్డిగూడెం మండలంలో పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు నిపుణులైన ఉపాధ్యాయులు తయారు చేసినటువంటి స్టడీ మెటీరియల్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఎంఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, దాత ముప్పిడి నాగేశ్వర రెడ్డి ఆర్థిక సహకారంతో అందజేశారు. మండలంలో నాలుగు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, కెజిబివి, గురుకుల పాఠశాల, మోడల్‌ స్కూల్‌, గీతాంజలి, నారాయణ పాఠశాలలతో కలిపి మొత్తం తొమ్మిది పాఠశాలల విద్యార్థులకు ఐదు వందల పుస్తకాలు అందజేశారు. ప్రతీ పాఠశాల విద్యార్థులను కలిసి ప్రత్యేకంగా వారికి స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చిన దాత ముప్పిడి నాగేశ్వర రెడ్డికి యూటీఎఫ్‌ రెడ్డిగూడెం మండల శాఖ అభినందనలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి పి.భవాని,రెడ్డిగూడెం మండల గౌరవాధ్యక్షులు డి.ప్రకాష్‌,ప్రధాన కార్యదర్శి పి.సుబ్రహ్మణ్యం,అధ్యక్షులు టి. బాల భాస్కరరావు, కార్యదర్శులు కట్టా రవి బాబు, కట్టా విజరు పాల్గొన్నారు.వీరికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.

➡️