నెల్లూరు జైలుకు రామకృష్ణారెడ్డి తరలింపు

Jun 27,2024 20:57
నెల్లూరు జైలుకు రామకృష్ణారెడ్డి తరలింపు

రామకృష్ణారెడ్డిని జైలుకు తలిస్తున్న దృశ్యం
నెల్లూరు జైలుకు రామకృష్ణారెడ్డి తరలింపు
ప్రజాశక్తి -నెల్లూరు :వైసిపి నేత, మాచ్ల మాజీ ఎంఎల్‌ఎ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసు అధికారులు గురువారం ఉదయం నగరంలోని జిల్లా కేంద్ర కారాగారానికి భారీ బందోబస్త్‌ నడుమ తరలించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, పోలింగ్‌ బూత్‌లో ఈవిఎంను ధ్వంసం చేయడం, పోలీసులపై చేయి చేసుకోవడం తదితర పరిణామాలపై ఇసి పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై వివిధ సెక్షన్లపై కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లిని బుధవాం పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. దీంతో ఆయనకు గురువారం కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ను పోలీసు అధికారులు భారీ పోలీసు బందోబస్తునడుమ సెంట్రల్‌ జైలుకు తీసుకొచ్చారు. అక్కడే వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

➡️