మూలస్థానం వద్ద రోడ్డు ప్రమాదం

Apr 2,2024 16:23 #Konaseema, #road accident

ప్రజాశక్తి – ఆలమూరు :  మండలంలోని మూలస్థాన అగ్రహారం 216ఏ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు హైవే పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. స్థానికుల వివరాలు ప్రకారం రాజమండ్రి వైపు నుండి రావులపాలెం వైపు ఇటుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను అదే మార్గంలో వెళుతున్న టిప్పర్ లారీ డీకొంది. దీంతో ట్రాక్టర్ పై కూర్చున్న మూలస్థాన అగ్రహారానికి చెందిన ఎం.రామకృష్ణకు తీవ్ర గాయాలైనట్లు వారు తెలిపారు. అలాగే మొదటిగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొని, తర్వాత ట్రాక్టర్ ను ఢీకొన్నట్టు, ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి ప్రమాదం నుండి బయటపడినట్లు తెలిపారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఎస్సై ఎల్.శ్రీను నాయక్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని హైవేపై ట్రాఫిక్కుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ క్రేన్ తో వాహనాలను ప్రక్కకు తొలగించారు. కాగా తీవ్ర గాయాలైన రామకృష్ణను హైవే అంబులెన్స్ సిబ్బంది సిహెచ్.లక్ష్మి ఆధ్వర్యంలో ప్రధమ చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఎస్సై శ్రీను నాయక్ దర్యాప్తు చేస్తున్నారు.

➡️