టిడిపితోనే సమన్యాయం: గొట్టిపాటి లక్ష్మి

ప్రజాశక్తి-దర్శి: టిడిపితోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం దర్శి పట్టణంలోని పదో వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ముస్లింలకు అన్ని విధాల మేలు జరుగుతుందని ఆమె అన్నారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో చేసింది ఏమీ లేదని, అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా లేకుండా పోయిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా పార్టీ కార్యాలయం వద్ద బీసీ జయహో సభను జయప్రదం చేయాలని ఆమె విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నియోజకవర్గం అధ్యక్షుడు మోడీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన పార్టీ కార్యాలయం వద్ద సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన దర్శిలో జరిగే సదస్సును బీసీలంతా జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు వెంకటేశ్వర్లు, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దొనకొండ మండలం గంగదేవిపల్లికు చెందిన పలుకుటుంబాలు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండవాలు కప్పి గొట్టిపాటి లక్ష్మి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదరించండి.. అభివృద్ధి చేస్తా..ముండ్లమూరు: దర్శి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బిజేపి ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి మండలంలోని పూరిమెట్ల, ఈదర, బొప్పుడివారిపాలెంలో శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు పంచాయతీలలో ఆమెకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి మందలపు వెంకట్రావు, మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, మాజీ జెడ్‌పిటిసిలు కొక్కెర నాగరాజు, వరగాని పౌలు, నాయకులు మేదరమెట్ల వెంకట్రావు, గోవిందు, రమణ, రత్తయ్య, బీమినేని నర్సయ్య, చావా బ్రహ్మయ్య, బద్రి గోపాల్‌, జంపాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️