టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి

Apr 28,2024 20:45 #bapatla, #joins TDP, #Senior YCP leader

ప్రజాశక్తి – బాపట్ల :బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థన్‌రెడ్డి ఆదివారం టిడిపిలో చేరారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో తాడేపల్లిలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 1989లో బాపట్ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. తిరిగి 2009లో టిడిపి అభ్యర్థిగా బాపట్లలో పోటీ చేసి.. అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిపై స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. 2014లో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. అప్పటి నుంచి వైసిపిలోనే కొనసాగుతున్న గోవర్ధన్‌రెడ్డి ఈ మధ్యకాలంలో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎలాగైనా రఘుపతిని ఓడించేందుకు టిడిపిలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది.

➡️