బొబ్బిలిలో ప్రశాంతం

May 13,2024 22:18

ప్రజాశక్తి- బొబ్బిలి : బొబ్బిలి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బొబ్బిలి మండలంలోని అలజంగి, చింతాడ, పక్కి, రామభద్రపురం మండలంలోని కొండకెంగువ, భూసాయవలస గ్రామాల్లో టిడిపి వైసిపి మద్దతుదారులు మధ్య స్వల్ప గొడవలు జరిగాయి. పోలీసులు జోక్యంతో గొడవలు సద్దుమణిగాయి. పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. అలజంగిలో వైసిపికి అనుకూలంగా బిఎల్‌ఒఅలజంగిలో వైసిపికి అనుకూలంగా బిఎల్‌ఓ సతీష్‌ పని చేశారని టిడిపి మద్దతుదారులు ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రంలో బిఎల్‌ఒ వైసిపికి ఓటు వేయాలని ఓటర్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్‌ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సాయిశ్రీ పరిశీలించి బిఎల్‌ఒ సతీష్‌ను బయటకు పంపివేశారు. బిఎల్‌ఒపై చర్యలు తీసుకుంటామని ఆర్‌ఒ సాయిశ్రీ చెప్పారు. గొడవలకు పాల్పడిన ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పక్కిలో టిడిపి, వైసిపి వర్గాల మధ్య వాగ్వివాదం జరగ్గా పోలీసులు జోక్యంతో సద్దుమణిగింది.ఓటుహక్కును వినియోగించుకున్న యువ ఓటర్లుయువ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరిచారు. తమ మొదటి ఓటును తాము అభిమానించే నాయకునికి వేసేందుకు యువత పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కట్టారు. ఏ పోలింగ్‌ కేంద్రంలో చూసిన యువ ఓటర్ల హడావుడి కనిపించింది.మొరాయించిన ఇవిఎంలుబొబ్బిలిలో ఇవిఎంలు మొరాయించాయి. ఇవిఎంలు మొరాయించిన పోలింగ్‌ కేంద్రాలలో నత్తనడకన పోలింగ్‌ జరిగింది. మున్సిపాలిటీలోని తారక రామ కాలనీ, మల్లమ్మపేట పోలింగ్‌ కేంద్రాలలో ఇవిఎంలు మొరాయించడంతో సాంకేతిక సిబ్బంది బాగు చేశారు. దిబ్బగుడివలసలో ఇవిఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. పక్కి, తారక రామ కాలనీలో పోలింగ్‌ నత్తనడకన జరిగింది. అలజంగి, చింతాడలో తోపులాటమండలంలోని అలజంగి, చింతాడ పోలింగ్‌ కేంద్రాల వద్ద టిడిపి, వైసిపి కార్యకర్తలు మధ్య తోపులాట జరిగింది. అలజంగిలో బిఎల్‌ఒ సతీష్‌ అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ టిడిపి మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సాయిశ్రీ పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్‌ కేంద్రంలో ఉన్న బిఎల్‌ఒ సతీష్‌ను బయటకు పంపించారు. బిఎల్‌ఒ సతీష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌ఒ సాయిశ్రీ చెప్పారు. పోలింగ్‌ కేంద్రం బయట ఇరువర్గాలు గొడవలకు దిగడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి చెదరగొట్టారు. చింతాడలో కూడా టిడిపి, వైసిపి కార్యకర్తలు గొడవలకు దిగడంతో పోలీసులు కలుగజేసుకుని చెదరగొట్టారు. వృద్దులు, వికలాంగులకు తప్పని అవస్థలుపట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలలో వీల్‌ ఛైర్స్‌ ఏర్పాటు చేయకపోవడంతో ఓటు వేసేందుకు వచ్చిన వృద్దులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టిఆర్‌ కాలనీలో ఒక వృద్దురాలు ఓటు వేసేందుకు వచ్చి ఇబ్బందులు పడడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కనకరాజు ఆమెను ఎత్తుకుని తీసుకు వెళ్లి ఓటు వేయించి మరల తీసుకు వచ్చారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాలలో వీల్‌ ఛైర్స్‌ ఏర్పాటు చేసినప్పటికీ చాలా పోలింగ్‌ కేంద్రాలలో ఏర్పాటు చేయలేదు. బాడంగి: వృద్ధులు, వికలాంగులకు పోలింగ్‌ కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించడంలో ఎన్నికల అధికారులు విఫలమయ్యారు. వర్క్‌ ఫర్‌ హోమ్‌ ఓటు పై కూడ అధికారులు అవగహన కల్పించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.పోలింగ్‌ ప్రశాంతంరామభద్రపురం: మండల వ్యాప్తంగా చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 నుంచే క్యూ లైన్లు నిండుకున్నాయి. బూసాయ వలస, కొండకెంగువల్లో టిడిపి, వైసిపి కార్యకర్తల నడుమ స్పల్ప తగాదాలు చోటు చేసుకున్నప్పటికీ పోలీసుల చొరవతో సద్దు మనిగాయి. కొండకెంగువలో ఇవిఎం మెరాయించడంతో కొద్దిసేపు పోలింగ్‌ నిలిచి పోయింది. దీంతో ఎండలో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల పోలింగ్‌ కేంద్రాల్లో మాజీ వాలంటీర్లు హల్‌ చల్‌ చేశారు. వారిని నిలువరించడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. వర్షం కారణంగా విద్యుత్‌ నిలిపి వేయడంతో చాలా మందకొడిగా పోలింగ్‌ కొనసాగింది.మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన తన సోదరుడు రామ్‌ నాయనతో కలిసి తాండ్రపాపరాయ మున్సిపల్‌ పాఠశాలలో ఓటుహక్కును వినియోంచుకున్నారు. అనంతరం బేబినాయన, ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వేర్వేరుగా పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు.తెర్లాం మాజీ ఎమ్మెల్యే తెంటు లక్షుంనాయుడు మండలంలోని ముగడ గ్రామంలో తన ఓటును వినియోగించుకున్నారు. బొబ్బిలి మండలంలోని పక్కి గ్రామంలోని ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

➡️