టిడిపితోనే సామాజిక భద్రత

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: టిడిపి పాలనలోనే మహిళలకు ఉపాధి, సామాజిక భద్రత సాధ్యమని టిడిపి యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు కుమారుడు గూడూరి అజిత్‌, కుమార్తె డాక్టర్‌ గూడూరి చెల్సియా అన్నారు. ఆదివారం వారు టిడిపి నాయకులతో కలిసి యర్రగొండపాలెం పట్టణంలోని పలు వీధులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలసలు ఆపేందుకు అవసరమైన పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత టిడిపిదని అన్నారు. స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. సూపర్‌ సిక్స్‌, మినీ మ్యానిఫెస్టోలోని పథకాలను వివరించి జరుగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తన తండ్రి గూడూరి ఎరిక్షన్‌బాబును, ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ చేకూరి సుబ్బారావు, నాయకులు షేక్‌ రఫి, కొత్తమాసు క్రిష్టయ్య, షేక్‌ మస్తాన్‌వలి, దొంతా వెంకట్రావు గౌడ్‌, కంచర్ల పూల సుబ్బయ్య, విజరు, కె భాస్కర్‌, యూసఫ్‌, ఓర్సు వెంకటేశ్వర్లు, వేగినాటి శ్రీను, ముత్తులూరి మల్లికార్జునచారి, కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️