మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించండి.. ఎంహెచ్‌ఓకి వినతి

Feb 27,2024 17:43 #Kurnool, #muncipal workers

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : కర్నూల్‌ నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న మున్సిపల్‌ పారిశుద్ధ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారికె. విశ్వేశ్వర్‌ రెడ్డికి ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్‌. మునెప్ప మాట్లాడుతూ.. మున్సిపల్‌ పారిశుద్ధ కార్మికుల దీర్ఘకాలికంగా అనేక సమస్యలతో సతమాతమవుతున్నారని తక్షణం వాటిని ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ రెగ్యులర్‌ కార్మికులకు పెండింగ్లో ఉన్న స్టిచ్చింగ్‌ చార్జీలు వెంటనే చెల్లించాలని 2003, 2004 ఆర్థిక సంవత్సరం యూనిఫామ్‌, చెప్పులు, కొబ్బరి నూనె, సబ్బులు వెంటనే కార్మికులకు ఇవ్వాలన్నారు. డివిజన్లో కార్మికులకు ఎదుర్కొంటున్న పనిముట్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్‌ కార్మికుల ఆలు బిడ్డలతో ఆనందంగా గడిపేందుకు ఆదివారం రోజున పూర్తి రోజు సెలవు దినం గా ఇవ్వాలన్నారు. మలేరియా కార్మికులపై పని బారిన తగ్గించాలన్నారు. మలేరియా కార్మికులకు 12 గంటల పని విధానాన్ని ఎనిమిది గంటలకు కుడించాలన్నారు. మలేరియా డివిజన్‌ కార్యాలయం వద్ద కార్మికులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ తీయాలన్నారు. కార్మిక సమస్యలు సకాలంలో పరిష్కరిం కాకుంటే ఆందోళన కార్యక్రమంలో సిద్ధమవుతావని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి జి. చంద్రశేఖర్‌ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పులగం. మద్దిలేటి, బాబులాలు. నాగశేషులు. సాములు, అయ్యరాజు ,ఏసన్న, బాలరాజు, మునిసిపల్‌ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

➡️