క్రియ పోటీల్లో శ్రీ ప్రకాష్‌ విద్యార్థుల ప్రతిభ

Nov 28,2023 14:20 #Kakinada

ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : నవంబర్‌ 25,26 తేదీలలో కాకినాడ జె.ఎన్‌.టి.యులో క్రియ (రాష్ట్ర స్థాయి బాలల పండుగ)లో జరిగిన అంతర్‌ పాఠశాలల సాంస్కతిక పోటీల్లో శ్రీ ప్రకాష్‌ విద్యార్థులు 96 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుచుకున్నారని విద్యాసంస్థల అధినేత సిహెచ్‌.వి.కె. నరసింహారావు తెలిపారు. లఘు నాటికలు, శాస్త్రీయ, జానపద నృత్యాలు, సంగీతం, బృందగాన పోటీలు, విచిత్ర వేషదారణ, స్టోరీ టెల్లింగ్‌, క్విజ్‌, వ్యాసరచన, చిత్రలేఖనం, మట్టితో బొమ్మలు చేయడం, మోడల్‌ మేకింగ్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌, సైన్స్‌ ప్రయోగాలు, ఇంగ్లీష్‌/హిందీ రోల్‌ ప్లే, మ్యాప్‌ పాయింటింగ్‌, కంప్యూటర్‌ స్కిల్స్‌ వంటి వివిధ పోటీలలో రాష్ట్రవ్యాప్తంగా 8000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో తమ విద్యార్థులు అధిక సంఖ్యలో బహుమతులు గెలుచుకోవడం హర్షణీయమని ఆయన తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సి.హెచ్‌. విజయ ప్రకాష్‌, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు అభినందించారు.

➡️