టిడిపి ఎన్నికల ప్రచారం

Apr 29,2024 22:05

వృద్ధురాలిని ఓటు అభ్యర్థిస్తున్న పల్లె కృష్ణకిషోర్‌రెడ్డి

                     కొత్తచెరువు రూరల్‌ : పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మండల పరిధిలోని ఇరగలపల్లి పంచాయతీ లోని తిప్పాబట్టపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరాయి. పార్టీలోకి చేరిన వారికి టిడిపి కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన వెంకట నారాయణ, ఇరగలపల్లి ఉపసర్పంచ్‌ శ్రీరాములు, ప్రణీత, మాజీ సర్పంచ్‌ నిర్మల, శ్రీధర్‌, శ్రీనివాసులు, జయరాం, వెంకటరాముడు ,వెంకటాచలం, సీనా వెంకటాచలం ,గోపాల్‌ నాయక్‌, హరీష్‌ ,మధుసూదన్‌, పేరుతోపాటు మరికొందరు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పల్లె కృష్ణకిషోర్‌ రెడ్డి, మాదినేని ఆదినారాయణ, హరీష్‌, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు. నల్లచెరువు : మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వందలాది మంది వైసిపి నాయకులు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. వైసిపి విధివిధానాలు నచ్చక టిడిపిలో చేరుతున్నట్లు వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ గెలుపునకు కృషి చేస్తాని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గాండ్లపెంట : టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని గొడ్డివెలగల దాసరవాండ్లపల్లి, వీరన్న గట్టుపల్లి, వంకలోపల్లి, టీ పెద్ద తండా, గరుగుతండా, సాతలవాండ్లపల్లి తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కదిరి వాల్మీకి విదాసంస్థల అధినేత పవన్‌ కుమార్‌ రెడ్డి, టిడిపి మండల కన్వీనర్‌ సి కొండయ్య, మాజీ సింగల్‌ విండో అధ్యక్షుడు ఏ వెంకటరమణారెడ్డి, సర్పంచులు శివప్ప నాయుడు, మాజీ ఎంపీపీ గంగరాజు, మాజీ సర్పంచి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు బుక్కపట్నం : కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి మద్దతుగా టిడిపి స్థానిక నాయకులు మండల కేంద్రంలోని కోటవీధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం రూపొందించిన సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్‌బాషా, అశోక్‌, భాస్కర్‌ రాయల్‌, మన్సూర్‌, నాగభూషణం, మనోహర్‌, బాబా, జబీబుల్లా తదితరులు పాల్గొన్నారు. పరిగి : మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు అని పెనుగొండ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అన్నారు. మండలంలోని కాలువపల్లి నిషా గార్మెంట్స్‌ లో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలతో మహిళలకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చామన్నారు. ప్రతి మహిళకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఉద్దేశంతో ముందస్తు ఆలోచనతో ఏర్పాటుచేసిన దిశా గార్మెంట్స్‌ ఎంతోమంది నిరుపేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదన్నారు. చంద్రబాబుకు మహిళలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గార్మెంట్స్‌ యాజమాన్యంతో పాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఓబుళదేవర చెరువు : పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పల్లె సింధూరను గెలిపించాలని టీడీపీ యువ నాయకుడు పల్లె వెంకటకృష్ణకిషోర్‌ రెడ్డి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓడి చెరువు మండలం కుసుమ వారిపల్లి మామిళ్ళకుంట్లపల్లి పంచాయతీలోని ఎం కొత్తపల్లి ,వడ్డీవారిపల్లి తోట్లిపల్లి ,మామిళ్లగుంట్లపల్లి గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోజనసేన నాయకులు కొండ బయన్న సతీష్‌, మండల కన్వీనర్‌ జయచంద్ర, ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్‌ ,అంజినప్ప, మండోజి ఆరిఫ్‌ ఖాన్‌, డాక్టర్‌ జాకీర్‌ అహ్మద్‌, షానవాజ్‌ ,ఇర్షాద్‌, ఎద్దుల ప్రమోద్‌ కుమార్‌ రెడ్డి , రాజారెడ్డి, రామాంజి, బోర్‌ రమణ ,తదితరులు పాల్గొన్నారు. కదిరి టౌన్‌ : కూటమి ప్రభుత్వంతోనే ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం కదిరి రూరల్‌ మండలం వీరన్న గట్టుపల్లి, కొత్త రామపురం, పత్తి గడ్డ, ముష్టిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మినీ మ్యానిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ కు సంబంధించిన అంశాలను ప్రజలకు వివరిస్తూ సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పుట్టపర్తి రూరల్‌ : మండల పరిధిలోని కోట్లపల్లి, సూరగానిపల్లి, నిడిమామిడి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరించారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సింధూరను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు కంసల నారాయణస్వామి, నాగిరెడ్డి, వెంకటేశు, మణికుమార్‌, రామాంజనేయులు, నక్కా వెంకట్రాముడు తదితరులు పాల్గొన్నారు. హిందూపురం : 27వ వార్డు వైసిపి కౌన్సిలర్‌ నాగేంద్రమ్మ సోమవారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈమెకు బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి పార్టీ కండువా వేసి టిడిపిలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు డిఇ. రమేష్‌ కుమార్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ జెవిఎస్‌ అనిల్‌, నాయకులు గణేష్‌, రవి, నాగర్జున, హిదాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి క్రైమ్‌ : రూరల్‌ మండల కేంద్రంలోని వెంగళమ్మ చెరువు పంచాయతీ వీర చిన్నయ్య పల్లిలో పలువురు టిడిపిలో చేరారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి, పుట్టపర్తి టిడిపి యువ నాయకుడు రామ్‌ లక్ష్మణ్‌ ఆధర్వంలో వీరంతా టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, వడ్డే తిరుపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️