టిడిపి ఎన్నికల ప్రచారం

May 9,2024 22:54

ఓటు అభ్యర్థిస్తున్న పల్లె సింధూరరెడ్డి

                  పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండాలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుతూ టిడిపి ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరించారు. బుధవారం వైసీపీ నాయకులు చేసిన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న యువకులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి భరోసా కల్పించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామంలోని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కదిరి టౌన్‌ : కదిరి నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే కందికుంట వెంకటప్రసాద్‌కు ఓటువేయాలని కందికుంట యశోదా దేవి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె గురువారం కదిరి పట్టణంలోని 6,8 వార్డుల్లో పర్యటించారు. సూపర్‌ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పుట్టపర్తి రూరల్‌ :తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం రెండూ రెండు కళ్లు లాంటివని టిడిపి పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి భర్త పల్లె వెంకట కష్ణ కిషోర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు ఆయన గురువారం రాచువారి పల్లి ,కప్పల బండ ,పంచాయతీ పరిధిలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ వైసిపి ప్రభుత్వం వస్తే ప్రజల నడ్డి విరగడం ఖాయమని హెచ్చరించారు. ప్రజా అభివృద్దికి పాటుపడే తెలుగుదేశం పార్టీ సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ టీడీపి అభ్యర్థి పల్లె సింధూర, హిందూపురం పార్లమెంటు అభ్యర్థి పార్థసారధిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

ధర్మవరం టౌన్‌ :టీడీపీలోకి వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ సమక్షంలో ధర్మవరం టీడీపీ కార్యాలయంలో 26వవార్డుకు చెందిన టీడీపీ నాయకుడు చీమల నాగరాజు, 10వ వార్డుకు చెందిన టీడీపీనాయకులు రామచంద్రల ఆధ్వర్యంలో 26, 10వ వార్డులకు చెందిన 40 మంది వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈనెల 13నజరిగే ఎన్నికలలో కమలం గుర్తుకు, సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పరిటాలశ్రీరామ్‌ సూచించారు.

➡️