అభివృద్ధిపై చర్చకు సిద్ధం

అభివృద్ధిపై చర్చకు టిడిపి సిద్ధమని

మాట్లాడుతున్న రామ్మోహన్‌ నాయుడు, రవికుమార్‌

ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షులు రవికుమార్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ అభివృద్ధిపై చర్చకు టిడిపి సిద్ధమని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ వైసిపి నాయకులు సవాల్‌ విసిరారు. నగరంలోని జిల్లా టిడిపి కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. యువత మేలుకో… ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకో… వైసిపి నేతల ఒత్తిళ్లకు లొంగిపోవద్దని సూచించారు. జగన్‌ యువకులు, కూలీలు పొట్ట చేత పటుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని అన్నారు. ఏటా జాబ్‌ కేలెండర్‌ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మడమ తిప్పారని ఆరోపించారు. ఫీజు రీయంబర్‌సమెంట్‌ సకాలంలో అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. విదేశీ విద్యనూ రద్దు చేశారని చెప్పారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందిస్తామని హామీనిచ్చారు. ఐదేళ్ల పాటు 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామన్నారు. యువత భవిష్యత్‌ కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇండ్రస్టీరియల్‌ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కను సక్రమైన మార్గంలో వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో టిడిపి నాయకులు పి.ఎం.జె.బాబు, బొణిగి భాస్కరరావు, మెండ దాసు, మెట్ట సుజాత, అనెపు రామకృష్ణ, మాదారపు వెంకటేష్‌, భాస్కర్‌, శంకర్‌ పాల్గొన్నారు.

 

➡️