అభివృద్ధే ధ్యేయం

అభివృద్ధే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ధ్యేయమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ సీతారాం

శాసనసభ స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- సరుబుజ్జిలి

అభివృద్ధే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ధ్యేయమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని తెలికిపెంట పంచాయతీ పాతపాడులో వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రం, విజయరాంపురంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, చిగురువలసలో రైతు భరోసా కేంద్రం, వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రం నూతన భవనాలను బుధవారం ప్రారంభించారు. అలాగే తెలికిపెంట, పాతపాడు, లొద్దల కాగితాపల్లి, వీరభధ్రాపురం, యరగాం గ్రామాల్లో జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయిల ద్వారా తాగునీరు అందించే పథకాలకు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కె.వి.జి.సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు బెవర కృష్ణవేణి, పిఎసిఎస్‌ అధ్యక్షులు కోవిలాపు చంద్రశేఖర్‌ వైస్‌ ఎంపిపి శివానందబాబు, బిసి సెల్‌ డైరెక్టర్‌ ముడడ్ల రమణ, ఎస్‌సి సెల్‌ డైరెక్టర్‌ ఎడ్ల ఈశ్వరరావు పాల్గొన్నారు.

 

➡️