ఆర్‌జివికి ధీటుగా సినిమా తీస్తా

రాంగోపాల్‌ వర్మ అందిస్తానన్న వ్యూహం

మాట్లాడుతున్న నట్టికుమార్‌

  • నిర్మాత నట్టి కుమార్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రాంగోపాల్‌ వర్మ అందిస్తానన్న వ్యూహం సినిమా వస్తుందో లేదో గాని అందుకు భిన్నంగా తాను రాజకీయ ఇతివృత్తం గల సినిమాను తీస్తానని సినీ దర్శక, నిర్మాత నట్టికుమార్‌ తెలిపారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన ముందుగా అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం నగరంలో ఇప్పిలివారివీధిలో మాజీ సెన్సార్‌బోర్డు సభ్యులు ఇప్పిలి తిరుమలరావు స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నేతృత్యంలో సమిష్టి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఎంతో అవసరమన్నారు. రాజకీయాలకు సంబంధించి గతంలో అనేక సినిమాలు తీసిన అనుభవం ఉందని, టిడిపి, చంద్రబాబు అంటే తనకు అభిమానం ఉందన్నారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి కక్షపూరితంగా చంద్రబాబును జైలుకు పంపించడం తనకు మానసికంగా బాధ కలిగించిందన్నారు. ప్రతిసారి ఎన్నికల ముందు సర్వేలు నిర్వహించడం తనకు ఎంతో ఆసక్తని, ఇప్పుడు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ఎవరి ప్రభావం ఎంత మేరకు ఉందో తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 8 స్థానాలు టిడిపి విజయం సాధిస్తుందన్నారు. ఆర్‌జివి వ్యూహం సినిమాను తీశారని, అంతమాత్రాన సినిమాలకు ప్రభావితమై రాజకీయంగా ఓట్లు వేస్తారనుకోవడం భ్రమేనన్నారు. తాను తీయబోయే సినిమా నేటి రాజకీయాలకు అద్దం పట్టేదిగా ఉంటుందన్నారు.

 

➡️