ఆర్థికంగా చేయూతనిచ్చేందుకే ‘ఆసరా’

మహిళల ఆర్థిక స్వావలంబనకు ఆసరా దోహదపడిందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార ఎంపిడిఒ

శ్రీకాకుళం : నమూనా చెక్కును అందజేస్తున్న మంత్రి ప్రసాదరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

మహిళల ఆర్థిక స్వావలంబనకు ఆసరా దోహదపడిందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార ఎంపిడిఒ కార్యాలయంలో, శ్రీకాకుళం మండలం తండ్యాంవలస, నగరంలోని బలగ, పిఎస్‌ఎన్‌ఎం స్కూల్‌ ఆవరణలో సోమవారం వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు. నాలుగున్నరేళ్ల కాలంలో నాలుగు విడతల్లో ఆసరా పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఆసరాతో మహిళల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా స్త్రీల జీవితాల్లో భరోసా నింపిన ఏకైక ప్రభుత్వం వైసిపిదేనని కొనియాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చగలిగామన్నారు. ప్రజలకు పారదర్శక పాలన అందించామని చెప్పారు. అనంతరం ఆసరా నమూనా చెక్కులను అందజేశారు. అంతకుముందు నగరపాలక సంస్థ పరిధిలోని బలగ ప్రధాన మంచినీటి సరఫరా కేంద్రం వద్ద రూ.నాలుగు కోట్లతో నిర్మించిన 5 ఎంఎల్‌డి ఇన్‌ఫిల్ట్రేషన్‌ గ్యాలరీ, కలెక్షన్‌ వెల్‌, పంప్‌హౌస్‌, వాటర్‌ వర్క్స్‌ అభివృద్ధి పనులను ప్రారంభించారు. వైసిపి నాయకులు రామ్‌మనోహర్‌ నాయుడు, డిఆర్‌డిఎ పీడీ విద్యా సాగర్‌, డిసిఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, వైసిపి నాయకులు అంబటి శ్రీనివాసరావు, ఎంపిపిలు గొండు రఘురాం, అంబటి నిర్మల, జెడ్‌పిటిసి రుప్ప దివ్య, మార్పు సుజాత, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎం.వి పద్మావతి, వైసిపి శ్రీకాకుళం రూరల్‌ మండలాధ్యక్షులు చిట్టి జనార్థనరావు, పీస గోపి, ఎఎంసి చైర్మన్‌ మూకళ్ల తాతబాబు తదితరులు పాల్గొన్నారు.ఎచ్చెర్ల : మహిళలకు ఆర్ధికంగా చేయూతనిచ్చి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆసరా ఎంతో తోడ్పడుతుందని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ అన్నారు. ఎచ్చెర్లలో కేశవరెడ్డి స్కూల్‌ సమీపంలో సోమవారం ఆసరా 4 విడత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉమెన్స్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బల్లాడ హేమమాలినిరెడ్డి, ఎంపిపి మొదలవలస చిరంజీవి, సనపల నారాయణరావు, యువజన విభాగం అధ్యక్షులు కొత్తకోట సూర్యారావు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు పాల్గొన్నారు. మెళియాపుట్టి : మహిళా సాధికారతే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం అందిస్తున్నట్టు ఎమ్మెల్యే రెడ్డి శాంతి, కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌, వైసిపి ఎంపీ అభ్యర్థి పి.తిలక్‌ అన్నారు. మండలంలో 986 స్వయం సహాయక సంఘాల్లో 10647 మంది మహిళలకు నమూనాల చెక్కును అందజేశారు. అనంతరం సిఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ పి.చంద్రకుమారి, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరుకుమార్‌, జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, పిఎసిఎస్‌ అధ్యక్షులు ఊర్లన బాలరాజు, మండల వైసిపి కన్వీనర్‌ పల్లి యోగి, ఎపిఎం లలిత పాల్గొన్నారు. కవిటి: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్‌లు ఆసరా నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు నర్తు శివాజీ, పూడి నీలాచలం, కర్రి గోపయ్య, ఎలమంచి నీలయ్య, పాండవ శేఖర్‌, దువ్వు కృష్ణారెడ్డి, దుగాన భద్రాచలం పాల్గొన్నారు. వెనుదిరిగిన మహిళలుజెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ కోసం డ్వాక్రా మహిళలకు నిరీక్షణ తప్పలేదు. ఉదయం 10 గంటలకే ఆసరా సమావేశం ఉందని చెప్పడంతో సభా ప్రాంగణానికి ఉదయం 9 గంటల నుంచి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అయితే 11.30 వరకు ఆమె వచ్చారు. మూడు గంటలకు పైగా నిరీక్షిస్తున్న మహిళలు ఒక్కొక్కరూ జారుకోడం ప్రారంభించా రు. పరిస్థితి గమనించిన ఎంపిపి ప్రతినిధి ప్రసంగాలు కుదించి చైర్‌పర్సన్‌కు మైక్‌ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ ఉండగానే మహిళలు ఒక్కసారిగా లేచిపోవడంతో సమావేశం ముగించాల్సి వచ్చింది. దీంతో సమావేశానికి మహిళలు హాజ రైనా చైర్‌పర్సన్‌ సమయపాలన పాటించకపోవడంతో అంతా బూడిదలో పోసిన పన్నీరైందనే విమర్శలు వినిపించాయి. అధికారుల తీరుపై మహిళలు మండిపాటుకోటబొమ్మాళి: స్థానిక మండల పరిషత్‌ ఆవరణలో నిర్వహిం చిన ఆసరా సభలో అభలలు నానా అవస్థలు పడ్డారు. నాలుగు విడత ఆసరా నమూనా చెక్కు పంపిణీ కార్యక్రమం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరనలో ఎంపీ అభ్యార్థి పేరాడ తిలక్‌, టెక్కలి అసెంబ్లీ అభ్యార్థి దువ్వాడ శ్రీనివాస్‌లు నిర్వహించారు. సమావేశానికి వచ్చిన వారికి మాత్రమే ఆసరా డబ్బులు ఖాతాల్లో జమవుతాయని, లేకుంటే అ డబ్బులు జమకాదని సిఎఫ్‌ల ద్వారా డ్వాక్రా మహిళలకు చెప్పి వారికి భలవతంగా రాప్పించారు. తీరా వచ్చాక కూర్చోందామంటే కుర్చిలు లేవు, నీల్చుందామంటే నీడలేదు, తాగుదామంటే నీరు లేదని డ్వాక్రా మహిళలు వాపోయారు. దీంతో పక్కన ఉన్న టిడిపి కార్యాలయ ఆవరణలో అన్వా క్యాంటీన్‌లో డ్వాక్రా మహిళలు అకలితీర్చుకుని ఇంటికి వెళ్లారు.

 

➡️