ఆర్మీ జవాన్‌కు అంత్యక్రియలు

మండలంలోని మోదుగులపుట్టికు చెందిన మద్దిల జోగారావు (40) ఆర్మీ జవాన్‌కు

మృతదేహానికి పూలమాలలు వేస్తున్న మంత్రి అప్పలరాజు

పలాస :

మండలంలోని మోదుగులపుట్టికు చెందిన మద్దిల జోగారావు (40) ఆర్మీ జవాన్‌కు స్వగ్రామంలో అధికార లాంఛనాలు నడుమ గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూకాశ్మీర్‌లోని దంపూర్‌ యూనిట్‌లో జెసిఒ క్యాడర్‌గా పని చేస్తూ బుధవారం మృతి చెందిన సంగతి పాఠకులకు విదితమే. జోగారావు మృతదే హానికి జాతీయ పతాకం కప్పి జమ్మూ-కాశ్మీర్‌ నుంచి హైదరాబాద్‌, అక్కడ నుంచి విశాఖపట్నం వరకు ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. విశాఖ నుంచి మోదుగులపుట్టికు తీసుకొచ్చారు. మృతదే హం ఇంటికి చేరుకున్న వెంటనే భార్య హేమ కుమారి, తల్లి ఆదిలక్ష్మి, కుమారుడు లక్ష్మీవరప్రసాద్‌, కుమరై చాందినీ కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం ఆర్మీ జవాన్లు సమక్షంలో ఎచ్చెర్ల రిజర్వుడు, స్థానిక పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. మృతుడు సోదరుడు ఆర్మీ జవాను మోహనరావు మృతదేహానికి తలకొరివి పెట్టారు. ముందు పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మృతదేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కాశీబుగ్గ ఎస్‌ఐ పారినాయుడు, ఎంపిపి ఉంగ ప్రవీణ, ఎంపిపి ప్రతినిధి ఉంగ సాయికృష్ణ పాల్గొన్నారు.

 

➡️