ఇంటింటికీ తాగునీరు అందిస్తాం

ప్రజలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస

ప్రజలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం మండలంలో నారిపేట, దిబ్బలపేట, కంచరాపువానిపేటలో జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన తాగునీటి కుళాయిలను స్పీకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రతి గ్రామానికి జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా తాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిపారు. తాగునీరును వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తమ్మినేని వాణిశ్రీ, చిరంజీవి నాగ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇఇ లలిత కుమారి, జెఇ చంద్రమౌళి, పంచాయతీ సెక్రెటరీ హరీష్‌, నాగరాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.సంక్షేమం కొనసాగాలంటే జగన్‌ గెలవాలి పొందూరు: రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కొనగాసాలంటే మళ్లీ సిఎంగా జగన్‌మోహన్‌రెడ్డినే గెలిపించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలం తోలాపిలో గురువారం నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అందజేసిన లబ్దిని చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, ఎఎంసి చైర్మన్‌ బాడాన సునీల్‌కుమార్‌, వైసిపి మండల అధ్యక్షుడు పప్పల రమేష్‌కుమార్‌, సర్పంచ్‌ ప్రతినిధి పప్పల రాధాకృష్ణ, దుంపల శ్యామలరావు, పప్పల అన్నాజీ, పప్పల రమణమూర్తి, గణపతిరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.

➡️