ఒకే రాష్ట్రం… ఒకే రాజధాని

అమరాజవతి రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది మంది రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో

పోలాకి : థియేటర్‌ వద్ద నినాదాలు చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి- నరసన్నపేట

అమరాజవతి రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది మంది రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన చిత్రం ‘రాజధాని ఫైల్స్‌’ విడుదల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యాన టిడిపి కార్యాలయం నుంచి గురువారం ర్యాలీ నిర్వహించారు. ఒకే రాష్ట్రం… ఒకే రాజధాని అంటూ నినదాలు చేశారు. రాజేశ్వర్‌ కళామందిర్‌ చేరుకొని సినిమా విక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని ఫైల్స్‌ సినిమా ప్రతిఒక్కరూ వీక్షించాలని కోరారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు పడుతున్న కష్టాలు ఇబ్బందులు కళ్లకు కట్టినట్టు చూపించారని తెలిపారు. ఇది రాజకీయ సినిమా కాదని, రైతుల సినిమా అని, ప్రతిఒక్క రైతూ చూడాల్సిన సినిమా అని అన్నారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

➡️