ఒపిఎస్‌ పునరుద్ధరించే వారికే మద్దతు

సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చిన వారికి ఉద్యోగుల ఉపాధ్యాయుల ఓట్లు వేస్తామని

పుస్తకాన్ని విడుదల చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చిన వారికి ఉద్యోగుల ఉపాధ్యాయుల ఓట్లు వేస్తామని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌ స్పష్టం చేశారు. నగరంలోని యుటిఎఫ్‌ భవనంలో జిల్లాశాఖ అధ్యక్షులు లండ బాబూరావు ఆధ్వర్యాన ఓట్‌ ఫర్‌ ఓ పి ఎస్‌, మన ఓటు మన భవిష్యత్‌ పుస్తకాలను గురువారం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న డిఎలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 11వ పిఆర్‌సి ఎరియార్స్‌ చెల్లించాలన్నారు. పిఎఫ్‌, సరెండర్‌ లీవ్‌లు చెల్లించాలన్నారు. 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు కె.దాలయ్య, కోశాధికారి రవికుమార్‌, జిల్లా కార్యదర్శిలు అన్నజీరావు, సురేష్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరిరవీంద్ర, త్రినాథరావు, కె.వెంకటరావు, చిన్నారావు, విశ్వనాథం పాల్గొన్నారు.

 

➡️