ఫైబర్‌ నెట్‌ ద్వారా ట్రిపుల్‌ ప్లే సేవలు

ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌ సేవలు అందించాలన్న

మాట్లాడుతున్న ఎపి ఫైబర్‌ నెట్‌ మేనేజర్‌ గౌతమ్‌ కుమార్‌

  • అపరేటర్లు సద్వినియోగం చేసుకోవాలి
  • ఎపి ఫైబర్‌ నెట్‌ మేనేజర్‌ గౌతమ్‌ కుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌ సేవలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎపి ఫైబర్‌ నెట్‌ సేవలను అందుబాటులోకి తెచ్చిందని ఎపి ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ మేనేజర్‌ గౌతమ్‌ కుమార్‌ తెలిపారు. ఇంటర్నెట్‌తో పాటు ట్రిపుల్‌ ప్లే సేవలు ఈ కనెక్షన్‌ ద్వారా పొందవచ్చని చెప్పారు. ఈ సౌకర్యాన్ని కేబుల్‌ ఆపరేటర్లు ప్రజలకు దగ్గర చేయాలని కోరారు. నగరంలోని ఫైబర్‌ నెట్‌ కార్యాలయంలో కేబుల్‌ ఆపరేటర్ల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ ధరలకు ఇంటర్నెట్‌ సౌకర్యం, ట్రిపుల్‌ ప్లే సేవలు అందించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ సర్వీసులను తీసుకుంటే రూ.లక్షల్లో ఖర్చవుతోందని, ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచే ఉచిత సర్వీసును అందిస్తున్నామన్నారు. మొదటగా కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా సర్వీసులను అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కేబుల్‌ ఆపరేటర్లు సహకరించకపోతే కొత్త వారికి అవకాశం ఇస్తామన్నారు.

 

 

➡️