బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్‌

సమసమాజ స్థాపనే ధ్యేయంగా సిఎం జగన్మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం అంబేద్కర్‌ 67 వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలో ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి

ఆమదాలవలస : విగ్రహం వద్ద నివాళ్లర్పిస్తున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస

సమసమాజ స్థాపనే ధ్యేయంగా సిఎం జగన్మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం అంబేద్కర్‌ 67 వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలో ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు సమాజంలో ఉన్న వివక్షతను రూపుమాపేందుకు అంబేద్కర్‌ జీవితకాలం చేసిన పోరాటం మరువలేనిదన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంఘ సంస్కర్తగా సమాజంలో పేరుగాంచిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్‌ అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతగా అంటరానితనంపై ఆయన పూరించిన సమర శంఖారావం చరిత్ర ఉన్నంత కాలం నిలిచిపోతుందన్నారు. దళిత, మహిళ, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడన్నారు. స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రిగా అమూల్యమైన సేవలు అందించి అనేక దేశాల రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి భారతదేశానికి దృఢమైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పారిశ్రామికీకరణ వ్యవసాయ అభివృద్దే దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మిన వ్యక్తన్నారు. అంబేద్కర్‌ ఆశయాలను నెరవేర్చేందుకు సిఎం జగన్మోహన్‌ రెడ్డి చిత్తశుద్ధితో పాటు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ వైస్‌ ఫ్లోర్‌ లీడర్‌ అల్లం శెట్టి ఉమామహేశ్వరరావు, వైసిపి నాయకులు మామిడి రమేష్‌ కుమార్‌, దుంపల శ్యామలరావు, బొడ్డేపల్లి రవి, సాదు కామేశ్వరరావు పాల్గొన్నారు.అంబేద్కర్‌ 67వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి జిల్లా టిడిపి అధ్యక్షులు కూన రవికుమార్‌ పూలమాలవేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల అప్పారావు, దళిత నాయకులు తోట రాము, రాడ విజయకుమార్‌, మాజీ కౌన్సిలర్‌ బోర గోవిందరావు పాల్గొన్నారు.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్‌ అని రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీరావు అన్నారు. అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలో ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు లఖినేని సాయిరాం, దాలయ్య, అప్పన్న, రమణ, సీతారాం పాల్గొన్నారు.పొందూరు: మండలంలో పొందూరు పట్టణంలో, కింతలి గ్రామాలలో దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 67వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లేపల్లి రాంగోపాల్‌, దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సాకేటి నాగరాజు, పొందూరు దళిత నాయకులు మెరక పోతయ్య, వజ్రగడ హరి, కంఠ శ్రీను, ఆదినారాయణ, అప్పారావు, సంజీవ భవానీ పాల్గొన్నారు.శ్రీకాకుళం అర్బన్‌: రాజ్యాంగ నిర్మాత డాక్టరు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 67వ వర్ధంతి కార్యక్రమం దళిత సంఘాల ఆధ్వర్యాన నగరంలో పాలకొండ రోడ్డులో గల అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు, కార్యక్రమంలో ఎస్‌ఎన్‌పిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్‌, దళిత నాయకులు కానుకుర్తి గోవింద్‌, సతివాడ చిరంజీవి, గుంట రామారావు, దుర్గ, టెంక నాని పాల్గొన్నారు.రణస్థలం రూరల్‌: బిఆర్‌ అంబేద్కర్‌ 67 వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి విజయనగరం జిల్లా బిజెపి అధ్యక్షులు నడుకుదిటి ఈశ్వరరావు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, జిల్లా దళిత మహాసభ ఉపాధ్యక్షులు డి.కుసుమ, మండలశాఖ అధ్యక్షులు కడియారపు కుమార్‌, ఉపాధ్యక్షులు కె.రాజయ్య, కె.అప్పారావు పాల్గొన్నారు. మండలంలో దేరసాం గ్రామంలో అంబేద్కర్‌ యువసేన ఆధ్వర్యంలో బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో యువసేన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణ, దువ్వాన చినరాము, దువ్వాన గిరి, బంటు రాము, బంటు రాముడు పాల్గొన్నారు.జి.సిగడాం: అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా మండలంలో అద్దానంపేట ప్రాథమిక పాఠశాల, కెజిబివి మోడల్‌ స్కూల్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అలాగే అద్దానంపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అంబేద్కర్‌ వేషధారణలు వేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.బూర్జ: మండలంలో ఒవిపేట గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహానికి వైస్‌ ఎంపిపి బుడుమూరు సూర్యారావు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. విశ్రాంత డిప్యూటీ డిఇఒ ఇసాయి వెంకటరావు, మాజీ ఎంపిపి బొడ్డేపల్లి సూర్యరావు, ప్రధానోపాధ్యాయులు కేత సూర్యనారాయణ, మల్లిబాబు, శ్రీను పాల్గొన్నారు.టెక్కలి రూరల్‌: స్థానిక ఆదిఆంధ్రవీధిలోని అంబేద్కర్‌ విగ్రహానికి సిపిఎం నాయకులు కొల్లి యల్లయ్య, యర్ర వెంకట్రావులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం అందించిన హక్కులను, సదుపాయాలను అమలు జరిగే క్రమంలో ఇప్పటికీ అణగారిన వర్గాలకు అందించటంలో ప్రస్తుత పాలకులు వివక్షత చూపుతున్నాయని అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత లౌకికతత్వానికి తిలోదకాలు ఇచ్చి మతోన్మాదాన్ని పెంచుకుపోతున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నంబూరు షణ్ముఖరావు, పినిమింటి రామారావు, వై.శివరావు, వి.తిరుమల, యు.శంఖర్‌, జోగి లక్ష్మణరావు, యర్ర కొండలరావు పాల్గొన్నారు. అలాగే అంబేద్కర్‌ కూడలిలోని విగ్రహానికి ఎస్‌సి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుల బసవల ధనుంజయరావు, ప్రజాసంఘాలు నాయకులు చల్లా రామారావు, మాజీ ఎంపిపి సంపతరావు రాఘవరావు, అట్లా రాహుల్‌ కుమార్‌, బసవల గోపాలరావు, అక్కురాడ తాతారావులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కోటబొమ్మాళి: మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ కె.ఫణీంద్రకుమార్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ సంపతిరావు హేమసుందరరాజు, మండల విప్‌ బొడ్డు అప్పన్న, సర్పంచ్‌లు పేడాడ వెంకటరావు, గొద్దు చిరంజీవి పాల్గొన్నారు. అలాగే ఎంపిడిఒ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి కోటబొమ్మాళి సర్పంచ్‌ కాళ్ల సంజీవరావు, బోకర జడ్డెన్న, చల్ల చిరంజీవి, మండల ప్రత్యేకాధికారి మంద లోకనాధం, సామ సంజీవరావు, స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో ఆవరణలో ఎంపిఒ ఎస్‌.అప్పలనాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.గోవిందరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కవిటి : మండలంలోని బొరివంకలో మండల దళిత సంఘం అధ్యక్షుడు మద్దిలి కేశవరావు, బలగ నారాయణమూర్తి, బలగ ధర్మారావు, బలగ సూర్యనారాయణ, బెజ్జిపుట్టుగలో పొందల కృష్ణారావు, ఎఒ నరహింహమూర్తి, గొండ్యాల రాముర్తి, బార్ల జగన్నాథం, స్థానిక కల్యాణి ఆంగ్ల పాఠశాలలో ప్రిన్సిపాల్‌ బిందుమాధవిఅంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. వజ్రపుకొత్తూరు : భారత రాజ్యాంగాన్ని కాపాడు కుందామని ఐద్వా జిల్లా నాయకులు సుగుణవతి పిలుపునిచ్చారు. మండలంలోని నగరంపల్లిలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కేంద్రంలో బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాలను అమలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎన్‌.ఈశ్వరమ్మ, కిల్లి వేణమ్మ, గార జానికమ్మ, గార అక్కమ్మ, నెయ్యల సంతోష్‌, బి.లక్ష్మి, పి.వరలక్ష్మి, హేమలత, సునీల్‌ పాల్గొన్నారు. ఇచ్ఛాపురం : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి ఎంపిపి బోర పుష్ప, ఎంపిడిఒ ఈశ్వరరావు, కె.మోహనరావు, రాజశేఖరరెడ్డి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.పోలాకి : స్థానిక ఆస్పత్రి కూడలిలోని అంబేద్కర్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, అలాగే ఎంపిపి ప్రతినిధి ముద్దాడ భైరాగినాయుడు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రతినిధి మజ్జి లక్ష్మీనారాయణ, ఎంపిటిసి ప్రతినిధి తూలుగు అశోక్‌కుమార్‌, ఆర్‌.త్రినాథరావు, టిడిపి నాయకులు ఎం.వెంకట అప్పలనాయుడు, లుకలాపు రాంబాబు, భైరి భాస్కరావు పాల్గొన్నారు. నందిగాం: మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఎంపిపి నడుపూరు శ్రీరామ్మూర్తి, పిఎసిఎస్‌ అధ్యక్షులు కురమాన బాలకృష్ణారావు, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ జడ్యాడ జయరాం, మండల పార్టీ అధ్యక్షులు తమిరి ఫాల్గునరావు, మండల పరిషత్‌ ప్రత్యేక అహ్వానితులు చిన్ని జోగారావు యాదవ్‌ పాల్గొన్నారు. టెక్కలి : టిడిపి కార్యాలయం వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి మండల అధ్యక్షులు బగాది శేషగిరి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో హనుమంతు రామకృష్ణ, మట్ట పురుషోత్తం, మెండ దమయంతి, పోలాకి షణ్మూఖరావు, మామిడి రాము, బెహరా కాళీ, బసవల ఆప్పలస్వామి, రెయ్యి ప్రీతీష్‌ చంద్‌, ఇప్పిలి జగదీష్‌, సోడిమూడి కిరణ్‌ పాల్గొన్నారు. అలగే జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి కణితి కిరణ్‌కుమార్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో గవరయ్య, కుమారస్వామి, త్రివేణి, ఇలపండ రమేష్‌, ఆబోతు వెంకటరమణ, భాస్కర్‌, గురయ్య, మౌళి పాల్గొన్నారు. స్థానిక టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ తెంబురు గోవిందమ్మ ఆంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బేపల సతీష్‌కుమార్‌, ఆధ్యాపకులు రవికుమార్‌, కంచరాన శ్రీనివాసరావు, లూక్‌పాల్‌ పాల్గొన్నారు.పలాస : కాశీబుగ్గ బస్టాండ్‌ ఆవరణలోని అంబేద్కర్‌ విగ్రహానికి వైస్‌ చైర్మన్‌ సురేష్‌బాబు, బోనెల గోపాల్‌, తెంబురి మధుసూదన రావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యదర్శి తెప్పల పాపారావు, కె.రవికుమార్‌, రైల్వే యూనియన్‌ నాయకులు గిరి, కాశీబుగ్గ గ్రంథాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి సోషల్‌ డిపార్ట్‌మెంట్‌ సర్వీస్‌ అధికారి మల్లేశ్వరరావు, ఎంఇఒ సిహెచ్‌.శ్రీనివాసరావు, సూదికొండ కౌన్సిలర్‌ ప్రతినిధి శిష్టి గోపి అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. సంతబొమ్మాళి : సంతబొమ్మాళి మండలం సచివాలయం కార్యాలయం వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి జెడ్‌పిటిసి పాల వసంతరెడ్డి, పిఎసిఎస్‌ చైర్మన్‌ కెల్లి జగన్నాయకులు, సర్పంచ్‌ కళింగపట్నం లక్ష్మి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.

 

➡️