‘లోతుగెడ్డ’ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం

వైస్‌ ఎంపిపి లోతుగెడ్డ తులసీవరప్రసాదరావు నిర్ణయానికి

మాట్లాడుతున్న తులసీవరప్రసాదరావు

కొత్తూరు:

వైస్‌ ఎంపిపి లోతుగెడ్డ తులసీవరప్రసాదరావు నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని కార్యకర్తలు స్పష్టం చేశారు. స్థానిక చిట్టిబాబు కళ్యాణ మండపంలో ఆదివారం మండల స్థాయి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. తులసీవరప్రసాదరావు కు వైసిపిలో జరిగిన అన్యాయానికి ముక్తకంఠంతో ఖండిస్తున్నామని అన్నారు. స్థానికుల అభిప్రాయా నికి గౌరవం ఇవ్వని పార్టీలకు బుద్ధిచెబుతామని హెచ్చరించారు. రెండున్నర దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి వంచన లేకుండా కృషి చేసిన తులసీవరప్రసాదరావుకు సంఘీభావం తెలిపారు. అలాగే తమ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తే… ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లోతుగెడ్డ నిర్ణయం మేరకే తమ భవిష్యత్‌ కార్యాచరణ, ప్రణాళిక ఉంటుందని తెలియజే శారు. తామంతా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించి ఇష్టపూర్వకంగా సంతకాలతో తీర్మానించారు. అనంతరం తులసీవప్రసాదరావు మాట్లాడుతూ వైసిపిలో కొనసాగాలన్నా… పార్టీ మారాలన్నా… అవస రమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలన్నా కార్యకర్తల అభిప్రాయం తీసు కుంటానని అన్నారు. కార్యకర్తలు అభిప్రాయం ప్రకారం నా నిర్ణయం ఉంటుందని తేల్చిచెప్పారు. వైసిపి మాజీ మండల అధ్యక్షులు లోతుగెడ్డ తాతబాబు, ఎంపిటిసి అగతముడి సుశీల, పొడ్డిని సింహాచలం, బిర్లంగి కృష్ణవేణి, మెండ సుమతీ, చింతాడ శ్రావణి, సర్పంచ్‌లు శ్రీనివాసరావు, నిమ్మక కళావతి, అగుతుముడి రంజిత్‌కుమార్‌, అప్పారావు, శిమ్మ మధు, సనపల కోటి, షణ్ముఖరావు, మజ్జి భుజంగరావు, పారసిల్లి ఢిల్లేశ్వరరావు, శ్రీకరున, విజరురెడ్డి పాల్గొన్నారు.

 

➡️