వైసిపితోనే మహిళలకు ప్రాధాన్యం

Mar 3,2024 23:37
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ వైసిపి ప్రభుత్వం రావాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌

మాట్లాడుతున్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ వైసిపి ప్రభుత్వం రావాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అన్నారు. ఆదివారం మండలంలో లొద్దపుట్టి పంచాయతీలో పర్యటించి మహిళలతో సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లోద్దపుట్టి పంచాయతీకి వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, లబ్దిదారులు పొందిన పథకాల లబ్దిని మహిళలకు వివరించారు. అనంతరం లోద్దపుట్టిలో శ్రీజానకిమాత స్వయంశక్తి సంఘానికి చెందిన పంది సీతమ్మ, అంబటి బుద్థమ్మ ఇరువురు ఇటీవల మరణించడంతో 4వ విడత ఆసరా రుణమాఫీ డబ్బులను నామినిగా ఉన్న వారి కుటుంబ సభ్యులకు రూ.11,500 చొప్పున ఆమె అందించారు. కార్యక్రమంలో ఎంపిపి బోర పుష్ప, జెడ్‌పిటిసి నారాయణమ్మ, పిట్ట హేమలత, ఆశి మందాకిని, పురుషోత్తం పాల్గొన్నారు.

 

➡️