శాశ్వత లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

శాశ్వత లోక్‌ అదాలత్‌తో ఉచితంగా సత్వర న్యాయ సహాయం అందుతుందని శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ జి.జ్ఞాన సువర్ణరాజు అన్నారు. స్థానిక వికాస్‌ జూనియర్‌

మాట్లాడుతున్న శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ జ్ఞాన సువర్ణరాజు

  • శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ జ్ఞాన సువర్ణరాజు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

శాశ్వత లోక్‌ అదాలత్‌తో ఉచితంగా సత్వర న్యాయ సహాయం అందుతుందని శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ జి.జ్ఞాన సువర్ణరాజు అన్నారు. స్థానిక వికాస్‌ జూనియర్‌ కళాశాలలో సోమవారం నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. శాశ్వత లోక్‌ అదాలత్‌ ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతుందో పలు ఉదాహరణలతో వివరించారు. శాశ్వత లోక్‌ అదాలత్‌ ఇచ్చే తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో సమానమన్నారు. ఈ తీర్పుకు ఎలాంటి అప్పీలు లేదని, దీని ద్వారా పది రకాలైన ప్రజా ప్రయోజిత సేవా రంగాలకు సంబంధించిన సేవల్లో ఎలాంటి అవాంతరాలు, లోపాల వల్ల నష్టాలకు త్వరితగతిన న్యాయ పరిష్కారం పొందవచ్చన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌, శాశ్వత లోక్‌ అదాలత్‌కు గల వ్యత్యాసంపై అవగాహన కల్పించారు. సాధారణ లోక్‌ అదాలత్‌తో ఇప్పటికే ఎన్నో కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. సదస్సులో వికాస్‌ జూనియర్‌ కళాశాల డైరెక్టర్‌ కూన వేణుగోపాలరావు, వైస్‌ డైరెక్టర్‌ కూన మురళీకృష్ణ, న్యాయవాది ఇందిరా ప్రసాద్‌ ప్రిన్సిపాల్‌, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

➡️