సమ్మె చట్టబద్ధం

నాలుగేళ్లుగా సమస్యల పరిష్కారానికి

పలాస : మాట్లాడుతున్న గోవిందరావు

  • షోకాజ్‌ నోటీసులకు అంగన్వాడీల సమాధానాలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం యంత్రాంగం

నాలుగేళ్లుగా సమస్యల పరిష్కారానికి పలురకాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో చట్టబద్ధంగా సమ్మె చేపట్టినట్లు అంగన్వాడీలు స్పష్టం చేశారు. ఐసిడిఎస్‌ అధికారులు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు అంగన్వాడీలు గురువారం సమాధాన లేఖలను అందజేశారు. శ్రీకాకుళం నగరంలోని అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టిన అనంతరం సిడిపిఒకు సమాధాన లేఖలను అందజేశారు. అంగన్వాడీల సమ్మె సమంజసమైందని తెలిపారు. 38 రోజులుగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి అంగన్వాడీలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలపై సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. మహిళలనీ చూడకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించిందన్నారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు ఇచ్చిందన్నారు. అంగన్వాడీలపై అధికారుల బెదిరింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే జీవనం కష్టసాధ్యమన్నారు. అంగన్వాడీలకు ఎస్మా వర్తించదన్నారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తూ జిఒ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, ఎస్‌.చిట్టితల్లి, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. గారలో కొల్లివలస కూడలి నుంచి ఐసిడిఎస్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి షోకాజ్‌ నోటీసులకు సమాధాన లేఖలను అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎ.మహాలక్ష్మి, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు జె.కాంచన, రుక్మిణి, పద్మలత తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్లలో సమ్మె శిబిరం నుంచి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని సమాధాన లేఖలను అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు యు.శారద, లలిత, బి.కనకం, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రణస్థలంలో ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం నోటీసులకు సమాధాన పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు కె.సుజాత తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలసలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయ అధికారులకు సమాధాన లేఖలను అందజేశారు. అంతకుముందు సమ్మె శిబిరాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయుకులు ఎమ్‌.లత, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు బి.జ్యోతిలక్ష్మి ఎస్‌.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. బూర్జలో అంగన్వాడీల సమ్మెకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి సంఘీభావం తెలిపారు. అనంతరం ఐసిడిఎస్‌ అధికారులకు సమాధాన లేఖలను అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జ్యోతి, నాగమణి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. పలాసలో సమ్మెకు సిఐటియు పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, ప్రగతిశీల కార్మిక సంఘం నాయకులు కె.పురుషోత్తం, పుచ్చ దుర్యోధన తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం ఐసిడిఎస్‌ అధికారులకు సమాధాన లేఖలను అంగన్వాడీలు అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఎం.మంజుల, బి.సునీత, కె.జ్యోతి, బి.చామంతి తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాళిలో ఐసిడిఎస్‌ పిఒ చింతాడ హైమావతికి షోకాజ్‌ నోటీసులకు సమాధాన లేఖలను అంగన్వాడీలు అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ తదితరులు పాల్గొన్నారు. కొత్తూరులో ఐసిడిఎస్‌ పిఒ విమలకుమారికి సమాధాన లేఖలను అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిర్ల ప్రసాద్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు జలజాక్షి, కె.లక్ష్మి, రజని తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో ఐసిడిఎస్‌ పిఒ నాగరాణికి సామూహికంగా సమాధాన లేఖలను ఇవ్వడంతో ఆమె తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఆమెకు, అంగన్వాడీల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరకు అంగన్వాడీలు ప్రాజెక్టు కార్యాలయం గోడలకు సమాధాన లేఖలను అంటించి వెళ్లిపోయారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్‌.లకీëనారాయణ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు హైమ, బాలామణి తదితరులు పాల్గొన్నారు. టెక్కలిలో ఐసిడిఎస్‌ అధికారులకు సమాధాన లేఖలను అందించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్‌.షణ్ముఖరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు రమణమ్మ, సుజాత, పద్మావతి, రమ తదితరులు పాల్గొన్నారు.

 

➡️