స్విమ్మింగ్‌లో దరహాస్‌కు బంగారు పతకాలు

తిరుపతిలో గత నెల 9 నుంచి 11 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి సిమ్మింగ్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అండర్‌ -19 కేటగిరిలో శ్రీకాకుళం నగరానికి చెందిన మాస్టర్‌ విడి దరహాస్‌ రెండు బంగారు పతకాలు, ఒక సిల్వర్‌ పతకం సాధించాడు. న్యూఢిల్లీలో జనవరి మూడు నుంచి

మాస్టర్‌ దరహాస్‌ను అభినందిస్తున్న హారికా ప్రసాద్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం

తిరుపతిలో గత నెల 9 నుంచి 11 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి సిమ్మింగ్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అండర్‌ -19 కేటగిరిలో శ్రీకాకుళం నగరానికి చెందిన మాస్టర్‌ విడి దరహాస్‌ రెండు బంగారు పతకాలు, ఒక సిల్వర్‌ పతకం సాధించాడు. న్యూఢిల్లీలో జనవరి మూడు నుంచి 9 వరకు జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహించ నున్నారు. పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు హారిక ప్రసాద్‌, లైన్స్‌ క్లబ్‌ శ్రీకాకుళం అధ్యక్షులు కరణం శోభారాణి, కోశాధికారి తర్లాడ అప్పలనాయుడు పాల్గొన్నారు.16న రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలురాష్ట్రస్థాయి సిమ్మింగ్‌ పోటీలు ఈనెల 16, 17 తేదీల్లో నరసరావుపేటలో జరగనున్నాయని అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు హారిక ప్రసాద్‌ తెలిపారు. వీటిలో ఎంపికైన వారు బెంగుళూరులో ఈ నెల 27 నుంచి 29 వరకు సౌత్‌ జోన్‌ నేషనల్‌కు అర్హత సాధిస్తారని చెపారు.

 

➡️