హోరాహోరీగా ఛాంపియన్‌షిప్‌ పోటీలు

పలాస జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో జరుగుతున్న 47వ జాతీయ టెన్నికాయిట్‌ పోటీల్లో

ఆటలు ఆడుతున్న క్రీడాకారులు

ప్రజాశక్తి- పలాస

పలాస జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో జరుగుతున్న 47వ జాతీయ టెన్నికాయిట్‌ పోటీల్లో బుధవారం పురుష, మహిళా క్రీడాకారులు హోరాహోరీగా పాల్గొని తమ సత్తాను చాటారు. మొదటి రోజు టెన్నికాయిట్‌ చాంఫియన్‌ షిప్‌ పోటీల్లో హర్యానాపై పోటీకి దిగిన ఒడిస్సా జట్టు విజయం సాధించింది. అలాగే ఢిల్లీ జట్టుపై మహారాష్ట్ర, మధ్యప్రదేశపై తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌పై పాండిచ్చేరి జట్టు విజయం సాధించింది. అలాగే గుజరాత్‌పై ఆంధ్రప్రదేశ్‌ జట్టు, అస్సాంపై జార్కాండ్‌ జట్టు, జమ్ముకాశ్మీర్‌పై తమిళనాడు జట్టు విజయం సాధించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్లెడ్‌లైట్లు వెలుగుల్లో జరిగిన ఈ పోటీలు రసవత్రంగా సాగాయి. ఈ పోటీల్లో టెన్నికాయిట్‌ అసొసియేషన్‌ అధ్యక్షులు వై.డి. రామారావు, రాష్ట్ర కార్యదర్శి కెఎన్‌వి సత్యన్నారాయణ, రాష్ట్ర కోశాధికారి పి.తవిటయ్య, జిల్లా ఒలింపిక్‌ సంఘ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, రాష్ట్ర వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం ముఖ్య సలహాదారులు వి.సుందరరావులు పర్యవేక్షించగా స్థానిక వ్యాయామ ఉపాధ్యాయులు పి.తవిటయ్య, హరిబాబు, డి.రామారావు, పద్మలోచనలతో పాటు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులచే క్రీడలను ఆడించారు.

 

➡️