16న జెడ్‌పి స్థాయీ సంఘ సమావేశాలు

జిల్లాపరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల 16న

జెడ్‌పి కార్యాలయం

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాపరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల 16న నిర్వహించనున్నట్లు జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం పది గంటలకు జెడ్‌పి సమావేశ మందిరంలో సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఉదయం పది గంటలకు 6వ స్థాయి, 11 గంటలకు 3వ, మధ్యాహ్నం 12 గంటలకు 5వ స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు గంటలకు 2వ స్థాయి, మూడు గంటలకు 4వ, సాయంత్రం నాలుగు గంటలకు 7వ, ఐదు గంటలకు ఒకటో స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. సమావేశాలకు స్థాయీ సంఘాల సభ్యులు, పలు శాఖల అధికారులు హాజరు కావాలని పేర్కొన్నారు.

 

 

➡️