9న జాతీయ లోక్‌ అదాలత్‌

డిసెంబరు తొమ్మిదో తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థల అధ్యక్షులు జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు. జిల్లా కోర్టులోని సమావేశ

మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

  • జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి – శ్రీకాకుళం

డిసెంబరు తొమ్మిదో తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థల అధ్యక్షులు జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు. జిల్లా కోర్టులోని సమావేశ మందిరంలో మోటారు వాహన ప్రమాదాల కేసుల్లోని పిటిషనర్లు, న్యాయవాదులు, ఇన్సూరెన్స్‌ కంపెనీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ బ్యాంకు ప్రతినిధులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో మోటారు వాహన ప్రమాద కేసులను ఎక్కువగా రాజీ చేయాలని పిలుపునిచ్చారు. లోక్‌ అదాలత్‌లో మోటార్‌ ప్రమాద కేసులు రాజీ చేసుకోవడం వల్ల కక్షిదారులకు సత్వరమే పరిష్కారం లభిస్తుందన్నారు. ఇన్సూరెన్స్‌ కంపెనీలకూ కోర్టు ఖర్చులు, వడ్డీ తగ్గే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కె.శ్రీదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు ఎన్ని సూర్యారావు, మోటారు వాహన ప్రమాద కేసుల్లోని పిటిషనరు తరపు న్యాయవాదులు, ఇన్సూరెన్స్‌ కంపెనీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు మంచు జనార్థనరావు, ఎస్‌.రాజేశ్వరరావు, ఆర్‌టిసి స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

 

➡️