పాలిసెట్‌లో మెరిసిన విద్యార్థులు

ఎపి పాలిసెట్‌ ఫలితాలు

అరవింద్‌ను అభినందిస్తున్న పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు

  • 112వ ర్యాంకుతో జిల్లా టాపర్‌గా అరవింద్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, పోలాకి

ఎపి పాలిసెట్‌ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందారు. పోలాకి మండలం జిల్లేడుమాకివలసకు చెందిన గొల్లంగి అరవింద్‌ 112వ ర్యాంకుతో జిల్లా టాపర్‌గా నిలిచారు. తండ్రి రమణమూర్తి, శ్రీదేవి వ్యవసాయ పనులు చేస్తుంటారు. అరవింద్‌కు పదో తరగతిలో 573 మార్కులు వచ్చాయి. ఆమదాలవలస మండలం రెడ్డి క్వార్టర్స్‌ కూన హర్షితకు 115వ ర్యాంకు వచ్చింది. కోటబొమ్మాళికి చెందిన సకలాబత్తుల శ్రీవల్లి 143వ ర్యాంకు సాధించారు. తండ్రి కూన హరికృష్ణ (నాగు) ట్రావెల్స్‌ నడుపుతున్నారు. తల్లి జలజాక్షి పాలకొండ కోర్టులో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.పాలిసెట్‌ ఫలితాల్లో పోలాకి మండలంలోని శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గొల్లంగి అరవింద్‌ 112వ ర్యాంకు సాధించగా, కురిమిని హేమసుందర్‌ రెడ్డి 612, పట్నాన నాగేంద్ర 642, పల్ల రవివర్మ 852 ర్యాంకు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను స్కూల్‌ యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.పాలిసెట్‌లో 88.09 శాతం ఉత్తీర్ణతజిల్లాలో పాలిసెట్‌ పరీక్షలకు హాజరైన వారిలో 88.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల్లో బాలికలే అధిక శాతం మంది పాసయ్యారు. బాలికలు 4,583 మంది హాజరు కాగా 4,124 మంది (89.98శాతం) ఉత్తీర్ణులయ్యారు. 6,288 మంది బాలురు హాజరు కాగా 5,452 మంది (86.70 శాతం) పాసయ్యారు.

➡️