విద్యార్థులు ఒత్తిడికి లోనుకావద్దు

విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని, ఒత్తిడికి

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న సంస్థ ప్రతినిధులు

ప్రజాశక్తి- పలాస

విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని, ఒత్తిడికి గురికావద్దని కాశీబుగ్గ వైద్యులు టి.బాలకృష్ణ, తెప్పల ఆనందరావు, మట్ట ఖగేశ్వరరావు అన్నారు. మండలంలోని నీలావతి గ్రంథాలయం ఆవరణలో యువివి అధ్యక్షులు ఇసాకోటి జోగారావు అధ్యక్షతన ఉద్దాన ప్రాంత విద్యాభివృద్ధి వేదిక 22వ వార్షికోత్సవం వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు దుమ్ము శంకరరావు, సాహుకారి వల్లభరావు, బద్రి కూర్మారావు, లండ జగన్నాథం, పెద్దింటి శశిధరవర్మలకు దుశ్శాలువ కప్పి సన్మానించారు. అలాగే ఇటీవల విడుదలైన పదో తరగతిలో ప్రతిభ చూపించిన విద్యార్ధులకు అవార్డు అందజేశారు. కార్యక్రమంలో యువివి ప్రధాన కార్యదర్శి బొడ్డు చిన్నారావు, గౌరవ అధ్యక్షులు బి.ఓంకార్‌, గౌరవ సలహాదారులు కె.ప్రకాశరావు, టి.వాసుదేవరావు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ ఎన్నికగౌరవ అధ్యక్షులు కుత్తుం ప్రకాశరావు, అధ్యక్షులుగా బొమ్మాలి శివ, ఉపాధ్యక్షులు పోతనపల్లి గీతమ్మ, ప్రధాన కార్యదర్శి గోరకల లోకేశ్వరరావు, ఉప కార్యదర్శి యంపల్ల కామేశ్వరరావు, ఆర్థిక కార్యదర్శి జీనగ సీతారామయ్య, సహాయ కార్యదర్శి కుత్తుం ప్రసాద్‌, అకాడమిక్‌ సెల్‌ కన్వీనర్‌ కుత్తుం వినోద్‌, గ్రంథాలయ కన్వీనర్‌ పాలిన కృష్ణారావు, గ్రంథాలయ సహాయ కన్వీనర్‌ తామాడ మహేశ్వరరావు, సోషల్‌ మీడియా కన్వీనర్‌ దున్న సోమేశ్వరరావు, స్పోర్ట్స్‌ కార్యదర్శి సైని మధు, ఆడిట్‌ కమిటీ సుబుద్ధి సంతోష్‌ కుమార్‌, గ్రంథాలయ కమిటీ సభ్యులు పోతనపల్లి మాధవరావు, సహాయ ఆర్థిక కార్యదర్శి తంగుడు కగేశ్వరరావు, గౌరవ సలహాదారులు బత్తిని ఓంకారం తదితరులను ఎన్నుకున్నారు.

 

➡️