ఘనంగా బుద్ధ జయంతి

గౌతమ బుద్దుని 2568వ జయంతి వేడుకలు గురువారం

కొత్తూరు : జ్ఞాపికను అందజేస్తున్న హెచ్‌ఎం కృష్ణారావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

గౌతమ బుద్దుని 2568వ జయంతి వేడుకలు గురువారం బుద్ధిస్ట్‌ సొసైటీ శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యాన నగరంలోని ఇల్లీసుపురంలో అంబేద్కర్‌ విజ్ఞాన మందిర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుద్దిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయిడి మురళీ కృష్ణ హాజరై మాట్లాడారు. ప్రజ్ఞ, శీల, కరుణ అష్టాంగ మార్గాన్ని ప్రభోదించే మహాత్ముడు గౌతమ బుద్ధుడని కొనియాడారు. ఆయన మార్గాన్ని ఎంచుకుని అంబేద్కర్‌ భౌద్ద మతాన్ని ప్రజల్లో తీసుకెళ్లారని గుర్తు చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మైనార్టీ మత, కులస్తులపైన దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమానత్వం, రాజ్యాంగం హక్కులను కాలరాసే పరిస్థితి దాపురించిందన్నారు. కార్యక్రమానికి బి.ఎస్‌.ఐ జిల్లా అధ్యక్షులు కృష్ణారావు అధ్యక్షత వహించారు. బెందాళం కృష్ణారావు, డాక్టర్‌ రామారావు, కంఠ వేణు, లాస సోమేశ్వరరావు, చల్ల రామారావు, వాడాన కృష్ణారావు, చల్లా రామారావు, బొత్స బుద్ధుడు, రామప్పడు, భూపతి, చలపతి, దండాసి రాంబాబు (జాన్‌) తదితరులు పాల్గొన్నారు.కొత్తూరు : మండలంలోని పొన్నుటూరు ప్రాథమికోన్నత పాఠశాలలో రామరాజు ఛారిటబుల్‌ ఆధ్వర్యాన బుద్ధిని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు కృష్ణారావు, ఉపాధ్యాయులు అభినందించారు.సర్పంచ్‌ ఎద్దు చామంతి, సంతోష్‌కుమార్‌, వి.శేఖర్‌, కృష్ణారావు, అప్పన్న, త్రినాథ్‌లు పాల్గొన్నారు.

 

➡️