కోష్ట పోలింగ్‌ కేంద్రం పరిశీలన

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మండలంలోని కోష్ట

పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న తలత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా

ప్రజాశక్తి- రణస్థలం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మండలంలోని కోష్ట పోలింగ్‌ కేంద్రాన్ని జనరల్‌ అబ్జర్వర్‌ తలత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ రోహెల్లా బుధవారం పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రం పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆనంతరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని సందర్శంచి ఎన్నికల అధికారులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విజయనగరం జిల్లా రాజాం, బొబ్బిలి, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన వంటి ఎన్నికల సంబంధిత సమస్యలపై ఫిర్యాదు, సమాచారం కోరేందుకు ఆయా నియోజకవర్గాల పౌరులకు, ఓటర్లుకు అందుబాటులో ఉండడం జరుగుతుందన్నారు. నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పోలింగ్‌ నిర్వహించాలనే ఉద్దేశ్యంతో పోటీ చేసే అభ్యర్థి తరపున లేదా ఏదైనా రాజకీయ పార్టీ పేరు మీద ప్రజలకు డబ్బు, మద్యం, కూపన్లు, ఇతర ఉచితాలు, బెదిరింపులు తదితర ఫిర్యాదులు మొబైల్‌ నెంబర్‌ 9032338136, వశ్రీవష్‌ఱశీఅశీb- రవతీఙవతీఙఓఎఏస్త్రఎaఱశ్రీ.షశీఎ ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఓటర్లు ఫోటోగ్రాఫ్‌లు, షార్ట్‌ వీడియోలు, వాయిస్‌ మెసేజ్లు, టెక్స్ట్‌ మెసేజ్లు తదితరమైన వాటితో ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఫిర్యాదుదారులు తాము లేవనెత్తిన సమస్యలపై ప్రత్యుత్తరాలు ఇవ్వడానికి వారి పేరు, ఫోన్‌ నెంబర్‌, చిరునామా వివరాలను ఇవ్వాలన్నారు. ఆయనతో పాటు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.వి.లక్ష్మణమూర్తి, ఎన్నికల అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️