వైసిపిలో పలు కుటుంబాలు చేరిక

మండలం అయ్యవారిపేట కాళపర్తి, లాభం గ్రామాలకు

బూర్జ : కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న స్పీకర్‌ తమ్మినేని

ప్రజాశక్తి- బూర్జ

మండలం అయ్యవారిపేట కాళపర్తి, లాభం గ్రామాలకు చెందిన 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైసిపిలో చేరారు. మంగళవారం స్పీకర్‌ తమ్మినేని సీతారాం పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం, ఎంపీ అభ్యర్థి పేడాడ తిలక్‌ గెలుపునకు తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో ఇప్పిలి తిరుపతిరావు, పీరుకట్ల సూరిబాబు, గేదెల చిన్నమ్మ, గేదెల కిషోర్‌, మామిడి మణికంఠ, చింతనిప్పుల దుర్గారావు, మామిడి మహేష్‌ తదితరులు చేరారు. కార్యక్రమంలో ఎంపిపి కర్నెన నాగేశ్వరరావు, జెడ్‌పిటిసి బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర టిట్కో డైరెక్టర్‌ కండాపు గోవిందరావు, వైస్‌ ఎంపిపిలు సూర్యారావు, కృష్ణం నాయుడు, పిఎసిఎస్‌ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ గుమ్మడి రాంబాబు, స్థానిక నాయకులు గోపాలరావు, ఆనందరావు, ఎస్‌.గోవిందరావు, మాధవరావు పాల్గొన్నారుపొందూరు: మండలం కింతలిలో స్పీకర్‌, వైసిపి ఎమ్మెల్లే అభ్యర్ది తమ్మినేని సీతారాం, ఎంపీ అభ్యర్ది పేడాడ తిలక్‌ సమక్షంలో సోమవారం రాత్రి గ్రామానికి చెందిన పైడి నాగభూషణం ఆధ్వర్యంలో టిడిపి, కాంగ్రెస్‌కు చెందిన సుమారు 100 కుటుంబాలు వైసిపిలో చేరాయి. ఈ సందర్భంగా వారికి వైసిపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర కళింగ కార్పోరేషన్‌ చైర్మన్‌ దుంపల రామారావు, జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు, వైసిపి మండల అధ్యక్షుడు పప్పల రమేష్‌కుమార్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు కొంచాడ రమణ మూర్తి, ఎఎంసి చైర్మన్‌ బాడాన సునీల్‌కుమార్‌, పట్టణ అధ్యక్షుడు గాడు నాగరాజు, స్ధానిక నాయకులు బొమ్మాళి గిరి, సూర్యనారాయణ, లోకనాథం, తేజేశ్వరరావు, ఆనందరావు పాల్గొన్నారు.

 

➡️