పక్కాగా ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు

ఈనెల 24 నుంచి

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఈనెల 24 నుంచి జూన్‌ మూడో తేదీ వరకు నిర్వహించే పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో సుమారు 2,100 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఓపెన్‌ స్కూల్‌ ఎస్‌ఎస్‌సి పరీక్షలు రెండు కేంద్రాల్లో, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఐదు కేంద్రాల్లో జూన్‌ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. డైట్‌లో ప్రవేశానికి డిఇఇ సెట్‌ను రెండు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో 90 మంది, నరసన్నపేటలోని కోర్‌ టెక్నాలజీస్‌లో 270 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.

➡️